Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ, రోహిత్, పంత్ విన్యాసాలు.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
బుధవారం (డిసెంబర్ 24) నుంచి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీకి (Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది.
Do you where to whatch Vijay Hazare Trophy 2025 matches
Vijay Hazare Trophy : బుధవారం (డిసెంబర్ 24) నుంచి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. సుదీర్ఘ కాలం తరువాత సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ టోర్నీలో (Vijay Hazare Trophy) ఆడుతుండడంతో అందరి దృష్టి పడింది. కోహ్లీ ఢిల్లీకి, రోహిత్ శర్మ ముంబై కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు కూడా తమ తమ జట్లతో చేరి ప్రాక్టీస్ సైతం ఆరంభించారు. కోహ్లీ, రోహిత్‌లు ఇద్దరూ కూడా ఈ టోర్నీలో తమ తమ జట్ల తరుపున చెరో రెండు మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం.
అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ తెచ్చిన నిబంధన కారణంగా స్టార్ ఆటగాళ్లు అందరూ ఆడుతుండడంతో ఈ టోర్నీకి కొత్త కళ వచ్చింది. డిసెంబర్ 24న ప్రారంభయ్యే ఈ టోర్నీ జనవరి 18 వరకు జరగనుంది.
Pat Cummins : టీ20 ప్రపంచకప్ 2026లో పాట్ కమిన్స్ ఆడటం అనుమానమే!
తొలి మ్యాచ్‌లో ఢిల్లీతో ఆంధ్ర జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానం వేదిక కానుంది. వాస్తవానికి ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కడ చూడొచ్చంటే..?
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లను టీవీలో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష్య ప్రసారం కానున్నాయి. ఇక మొబైల్, ఓటీటీలో అయితే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి. అయితే.. లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లకు ప్రత్యక్షప్రసారం లేదు. కేవలం స్టార్ ఆటగాళ్లు ఆడే మ్యాచ్‌లు మాత్రమే ప్రసారం కానున్నాయి.
