ODI World cup : ఆసియాక‌ప్‌లో అశ్విన్‌, చాహ‌ల్‌, సుంద‌ర్‌ల‌కు ద‌క్క‌ని చోటు.. ఈ ముగ్గురు ప‌రిస్థితి ఏంట‌ని రోహిత్‌ను అడిగితే..

ఆగ‌స్టు 30 నుంచి ఆసియా క‌ప్‌కు తెర‌లేవ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు సోమ‌వారం జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ODI World cup : ఆసియాక‌ప్‌లో అశ్విన్‌, చాహ‌ల్‌, సుంద‌ర్‌ల‌కు ద‌క్క‌ని చోటు.. ఈ ముగ్గురు ప‌రిస్థితి ఏంట‌ని రోహిత్‌ను అడిగితే..

Ashwin-Chahal-Sundar

ODI World cup 2023 : ఆగ‌స్టు 30 నుంచి ఆసియా క‌ప్‌కు తెర‌లేవ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ టోర్నీలో పాల్గొనే భార‌త జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సోమ‌వారం జ‌ట్టును ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో 17 మంది స‌భ్యుల‌తో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. గాయాల‌తో గ‌త కొంత‌కాలంగా ఆట‌కు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లు రీ ఎంట్రీ ఇస్తుండ‌గా తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మకు సైతం చోటు ద‌క్కింది. దాదాపు ఇదే జ‌ట్టును వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, యజువేంద్ర చహ‌ల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ల గురించి ప్ర‌స్తుతం చ‌ర్చ మొద‌లైంది. ఆసియాక‌ప్ కోసం ప్ర‌క‌టించిన జ‌ట్టులో వీరికి చోటు ద‌క్క‌లేదు. ర‌వీంద్ర జ‌డేజాతో పాటు అక్ష‌ర్ ప‌టేల్‌, కుల్దీప్ యాద‌వ్‌కు అవ‌కాశం ఇచ్చారు. దీంతో అశ్విన్‌, చ‌హ‌ల్‌, సుంద‌ర్‌ల ప్ర‌పంచ‌క‌ప్ అవ‌కాశాలు గ‌ల్లంతు అయిన‌ట్లేన‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Olga Carmona : జ‌ట్టును విశ్వ‌విజేత‌గా నిలిపింది.. తీవ్ర విషాదంలో ముగిపోయింది.. ఓ ఛాంపియన్‌ వ్యథ

జ‌ట్టును ప్ర‌క‌టించిన త‌రువాత మీడియా స‌మావేశంలో దీనిపై టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స్పందించాడు. జ‌ట్టులో 17 మందికి మాత్ర‌మే చోటు ఉంద‌న్నాడు. అందుక‌నే చ‌హ‌ల్‌ను తీసుకోలేక‌పోయామ‌ని చెప్పుకొచ్చాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనేందుకు అశ్విన్‌, చాహ‌ల్‌, సుంద‌ర్‌ల‌తో స‌హా ఎవ‌రికీ త‌లుపులు మూసుకుపోలేద‌న్నాడు. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో లోతు పెంచేందుకే అక్ష‌ర్ ప‌టేల్‌ను తీసుకున్న‌ట్లు తెలిపాడు.

ర‌విచంద్ర‌న్ అశ్విన్ 2021-22 ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో చివ‌రి సారిగా భార‌త్ త‌రుపున వ‌న్డే మ్యాచ్ ఆడాడు. ఇక చాహ‌ల్ , సుంద‌ర్‌లు జ‌న‌వ‌రిలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన సిరీస్‌లో చివ‌రి సారిగా వ‌న్డే మ్యాచులు ఆడారు. ఇటీవలి కాలంలో ఆల్‌రౌండర్లుగా జ‌డేజా, అక్షర్ అద్భుతంగా రాణిస్తుండ‌డంతో అశ్విన్, చాహ‌ల్‌ల‌కు ఆసియా క‌ప్‌లో చోటు ద‌క్క‌లేదు. ఇక విండీస్ ప‌ర్య‌ట‌న‌లో మూడు వ‌న్డే మ్యాచుల్లో 7 వికెట్ల‌తో స‌త్తా చాటిన చైనామన్ స్పిన్న‌ర్ కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారు.

Asia Cup 2023: ఆసియాకప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ.. తిలక్ వర్మకు అవకాశం.. ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఎంట్రీ

ఆసియాక‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ. సంజూ శాంసన్(రిజర్వ్ ప్లేయర్).