ENG vs IND 3rd Test England won the toss and elected Bat in Lords test
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా, రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో లార్డ్స్ టెస్టులో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బౌలింగ్ చేయనుంది.
ఇక భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. వర్క్‌లోడ్‌మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో మ్యాచ్‌కు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వగా మూడో టెస్టులో అతడు ఆడుతున్నాడు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణ పై వేటుపడింది.
భారత తుది జట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
అటు ఇంగ్లాండ్ జట్లు ఓ మార్పుతో బరిలోకి దిగింది. జోష్ టంగ్ స్థానంలో జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆర్చర్ నాలుగేళ్ల తరువాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఇంగ్లాండ్ తుది జట్టు..
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్ బషీర్.