ENG vs IND : ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 ఆలౌట్.. గస్ అట్కిన్సన్‌కు ఐదు వికెట్లు..
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది.

ENG vs IND 5th test Team India all out 224 in first innings
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో కరుణ్ నాయర్ (57) హాఫ్ సెంచరీ చేశాడు. సాయి సుదర్శన్ (38), వాషింగ్టన్ సుందర్ (26)లు ఫర్వాలేదనిపించారు.
శుభ్‌మన్ గిల్ (21), ధ్రువ్ జురెల్ (19), రవీంద్ర జడేజా (9), కేఎల్ రాహుల్ (14), యశస్వి జైస్వాల్ (2) లు విఫలం అయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. జోష్ టంగ్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
Virat Kohli : బాత్రూమ్‌లో విరాట్ కోహ్లీ వెక్కి వెక్కి ఏడవడం చూశాను : చాహల్
20 పరుగులు నాలుగు వికెట్లు..
ఓవర్ నైట్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 204 పరుగులతో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 20 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఎనిమిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన హాఫ్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ ఓవర్ నైట్ స్కోరుకు మరో 5 పరుగులు జోడించి జోష్ టంగ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
మరికాసేపటికే మరో ఓవర్‌నైట్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ తన ఓవర్‌నైట్ స్కోరుకు మరో 7 పరుగులు జోడించి గస్ అట్కిన్సర్ బౌలింగ్‌లో ఓవర్టన్ క్యాచ్ అందుకోవడంతో 8వ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సేపు పట్టలేదు.