ENG vs IND : రెండో రోజు ఆటకు ముందు టీమ్ఇండియాకు బ్యాడ్ న్యూస్..
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను ఎంతో ఘనంగా ఆరంభించింది భారత్

ENG vs IND Rain To Spoil India Start In Leeds Day 2 Forecast Paints Grim Picture
హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ను ఎంతో ఘనంగా ఆరంభించింది భారత్. ఓపెనర్ యశస్వి జైస్వాల్(101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (127 నాటౌట్)లు శతకాలు బాదడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. క్రీజులో గిల్‌తో పాటు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (65) ఉన్నాడు. వీరిద్దరు అభేద్యమైన నాలుగో వికెట్ కు 138 పరుగులు జోడించారు.
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టులకు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో యువ ఆటగాళ్లు ఎలా ఆడతారోనని అభిమానులు ఆందోళన చెందారు. అయితే.. తొలి రోజు ఆటను చూసిన తరువాత వారి అనుమానాలు అన్ని పటాపంచలు అయ్యాయి. ఇక రెండో రోజు భారత బ్యాటర్లు జోరును కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే.. రెండో రోజు భారత జోరుకు కాస్త బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అక్యూవెదర్ ప్రకారం.. శనివారం ఉదయం ఎండ కాస్తుంది. ఉష్ణోగ్రత 28-29 డిగ్రీల సెల్పియస్ ల మధ్య నమోదు అవుతాయని తెలిపింది. 25 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు సూచించింది.
ఇక మధ్యాహ్నం మాత్రం వాతావరణం మారిపోతుందని, 86 శాతం వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 31శాతం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది.
yashasvi jaiswal: డాన్ బ్రాడ్‌మాన్ 95ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన యశస్వి జైస్వాల్..
అంటే అక్యూవెదర్ ప్రకారం.. రెండో రోజు ఆటలో రెండు, మూడో సెషన్‌లో వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడో సెషన్‌లో 77 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లీడ్స్‌లో పసుపు రంగు హెచ్చరికను జారీ చేశారు.