WTC points table 2027 : లార్డ్స్‌లో ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన భారత ర్యాంక్.. ప్రస్తుతం ఏ స్థానంలోనంటే.. ?
ఇంగ్లాండ్ గడ్డ పై భారత ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది.

England Beats India At Lord test updated WTC points table 2027
ఇంగ్లాండ్ గడ్డ పై భారత ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన భారత్ తొలి టెస్టు మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆ తరువాత పుంజుకుని రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా.. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో లార్డ్స్ ఓటమి భారత్ పై గట్టి ప్రభావాన్నే చూపించింది. భారత్ రెండు స్థానాలు దిగజారి నాలుగో స్థానానికి పడిపోయింది. అటు భారత్ పై గెలిచిన ఇంగ్లాండ్ రెండో స్థానానికి ఎగబాకింది.
ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా 100 శాతం విజయశాతం, 36 పాయింట్లతో డబ్ల్యూటీసీ 2025-27 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఇంగ్లాండ్ జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. 66.670 విజయశాతం 24 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇక మూడో స్థానంలో శ్రీలంక నిలిచింది. లంక జట్టు రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలవగా, మరో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఆ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉండగా విజయశాతం 66.670గా ఉంది. ఇక భారత జట్టు నాలుగో స్థానానికి పడిపోయింది. ఈ కొత్త సైకిల్‌లో భారత్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఓ మ్యాచ్‌లో గెలిచింది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా విజయశాతం 33.330గా ఉంది. ఇక ఐదో స్థానంలో బంగ్లాదేశ్ ఉండగా, ఆరో స్థానంలో వెస్టిండీస్ ఉంది.
భారత జట్టు ఇంగ్లాండ్‌తో మిగిలిన ఉన్న రెండు టెస్టుల్లో విజయం సాధిస్తే అప్పుడు తన స్థానాన్ని మెరుగుపరచుకోవచ్చు.