ENG vs IND : గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. గాయంతో మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం..
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.

Big shock to England Shoaib Bashir ruled out of remainder of series against India
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జూలై 23 నుంచి 27 మధ్య మాంచెస్టర్ వేదికగా జరగనుంది. నాలుగో టెస్టు ప్రారంభానికి 8 రోజులు విరామం ఉంది. అయినప్పటికి గెలుపు జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ షోయబ్ బషీర్ గాయం కారణంగా ఈ టెస్టు సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు.
లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో భారత తొలి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషర్ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 78వ ఓవర్‌ను షోయబ్ బషీర్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతిని టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్ట్రెయిట్ షాట్ ఆడాడు. బంతి ఆపేందుకు బౌలర్ షోయబ్ బషీర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి ఎడమ చేతికి గాయమైంది. వెంటనే అతడు నొప్పితో విలవిలలాడాడు. ఆ తరువాత అతడు మైదానాన్ని వీడాడు.
🚨 SHOAIB BASHIR RULED OUT. 🚨
– Bashir out of the Anderson-Tendulkar trophy due to injury. pic.twitter.com/djJzujBgJU
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
అతడికి స్కానింగ్ నిర్వహించగా ఎడమ చేతి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయినప్పటికి అతడు నొప్పిని భరిస్తూనే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదండోయ్.. భారత జట్టు ఆఖరి వికెట్ తీసేందుకు మైదానంలో అడుగుపెట్టి బౌలింగ్ వేశాడు. మహ్మద్ సిరాజ్‌ను ఔట్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్‌స్టోక్స్ .. షోయబ్ బషీర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు ఓ పోరాట యోధుడు అని అన్నాడు.
కాగా.. ఈ వారం చివరిలో బషీర్ చేతికి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ క్రమంలోనే అతడు భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడని పేర్కొంది.