Mohammed Siraj : వెంటాడిన దురదృష్టం.. సిరాజ్ బంతిని డిఫెండ్ చేశాడు కానీ.. హార్ట్ బ్రేకింగ్.. వీడియో వైరల్..
లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం కోసం చివరి కంటూ పోరాడింది.

ENG vs IND 3rd Test Mohammed Siraj defended the ball but it rolled onto the stumps
లార్డ్స్ టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం కోసం చివరి కంటూ పోరాడింది. ఓ వైపు రవీంద్ర జడేజా (61 నాటౌట్) గోడలా నిలబడి అద్భుత పోరాటమే చేశాడు. మరో ఎండ్‌లో నితీశ్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లు గొప్ప సహకారాన్నే అందించారు. ఒక్కో పరుగు జోడిస్తూ విజయం వరకు వెళ్లింది టీమ్ఇండియా. ఇక విజయానికి 23 పరుగులే అవసరం.
దీంతో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారితో పాటు మొబైల్, టీవీల్లో చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌లో మదిలో ఒక్కటే మెదులుతోంది. లార్డ్స్‌లో అద్భుతం జరగబోతుందని భావించారు. ఇక సగటు భారత క్రీడాభిమాని మాత్రం మన వాళ్లు అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పుడే షోయబ్ బషీర్ 75 ఓవర్ వేసేందుకు వచ్చాడు.
ONE OF THE MOST HEARTBREAKING DEFEATS FOR INDIA. 💔 pic.twitter.com/0MF39tEHiD
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 14, 2025
ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులను డిఫెన్స్ ఆడిన జడేజా మూడో బంతికి సింగిల్ తీశాడు. అప్పటికే సిరాజ్ 28 బంతులకు పైగా ఇంగ్లాండ్ బౌలర్లను కాచుకుని ఉండడంతో ఈ ఓవర్‌లోని చివరి మూడు బంతులను అతడు ఆడతాడని జడ్డూ భావించాడు. అనుకున్నట్లుగానే నాలుగో బంతిని సిరాజ్ డిఫెన్స్ ఆడాడు. ఇక ఐదో బంతిని సిరాజ్ బ్యాక్‌ఫుట్ తీసుకుని డిఫెండ్ చేశాడు. అయితే.. దురదృష్టం వెంటాడింది. ఆ బాల్ నెమ్మదిగా అతడి పక్క నుంచి వెళ్లి స్టంప్స్‌ను తాకడంతో బెయిల్స్ కిందపడ్డాయి.దీంతో టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశలు ఒక్కసారిగా ఆవిరికాగా.. భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
బాధతో సిరాజ్ క్రీజులోనే కులబడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇయర్‌లో హార్ట్ బ్రేకింగ్ ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.
లార్డ్స్ టెస్టు మ్యాచ్ స్కోరు వివరాలు..
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్.. 387
భారత తొలి ఇన్నింగ్స్.. 387
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్.. 192
భారత రెండో ఇన్నింగ్స్.. 170