ENG vs AFG : వాటే మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం.. ఇంగ్లండ్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం..

ఈ ఓటమితో టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది.

ENG vs AFG : వాటే మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం.. ఇంగ్లండ్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం..

Afghanistan Beats England (Photo Credit : Google)

Updated On : February 27, 2025 / 1:10 AM IST

ENG vs AFG : ఛాంపియన్స్ ట్రోఫీలో పెను సంచలనం నమోదైంది. గ్రూప్ బి లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో అఫ్ఘానిస్థాన్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఈ ఓటమితో టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించింది. 8 పరుగుల తేడాతో అఫ్ఘాన్ గెలుపొందింది. ఒకానొక దశలో ఓడిపోయేలా కనిపించినా.. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు బౌలర్లు ఇంగ్లండ్ వికెట్లు తీసి మ్యాచ్ మలుపుతిప్పారు. 326 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసే క్రమంలో ఇంగ్లండో 317 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో చెలరేగినా.. ఓటమి తప్పలేదు.

లాహోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అఫ్ఘాన్ జట్టు వీరోచితంగా పోరాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ సెంచరీతో చెలరేగాడు. 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అజ్మతుల్లా (41), కెప్టెన్ హష్మతుల్లా (40), మహమ్మద్ నబీ (40) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. లివింగ్ స్టోన్ 2 వికెట్లు పడగొట్టాడు.

Also Read : సెమీస్ నుంచి పాక్ నిష్క్ర‌మ‌ణ పై మౌనం దాల్చిన పీసీబీ.. వెనుక ఇంత క‌థ ఉందా?

326 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. దాదాపుగా గెలిచినంత పని చేసింది. సాలిడ్ ప్రదర్శన కనబరిచింది. అయితే, ఆఖరి ఓవర్ లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. కేవలం 4 పరుగులే చేసి పరాజయం పాలైంది. ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో రూట్ సెంచరీతో కదం తొక్కాడు.

Also Read : అందుకే టీమిండియా ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవబోతుంది: టీమిండియా మాజీ క్రికెటర్

111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జేమీ ఒవర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. అఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్ జాయ్ చెలరేగాడు. ఏకంగా 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. తన జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. ఇక సెంచరీ వీరుడు ఇబ్రహీం జద్రాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.