Eng Vs Ind: చెలరేగిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్..

Eng Vs Ind: చివరి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు చెలరేగారు. ఇంగ్లాండ్ ను 247 రన్స్ కే కట్టడి చేశారు. దీంతో ఇంగ్లాండ్ కు భారత్ పై 23 పరుగుల నామమాత్రపు ఆధిక్యం దక్కింది. గాయం కారణంగా క్రిస్ వోక్స్ బ్యాటింగ్ కు రాలేదు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ హాఫ్ సెంచరీలు చేశారు. క్రాలే 57 బంతుల్లో 64 పరుగులు చేశాడు. బ్రూక్ 64 బంతుల్లో 53 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ తలో 4 వికెట్లు పడగొట్టారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది.