England vs India: మహిళల టీ20 ప్రపంచకప్: ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓటమి
England vs India, Women’s T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ బీలో శనివారం జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లండ్ తో భారత్ తలపడుతోంది.

England vs India, Women’s T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ బీలో శనివారం ఇంగ్లండ్ భారత్ తలపడ్డాయి. 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
భారత జట్టు
హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్(వికెట్ కీపర్), శిఖా పాండే, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గయాక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్
ఇంగ్లండ్ జట్టు
హీథర్ నైట్(కెప్టెన్), సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్, ఆలిస్ క్యాప్సే, నాట్ స్కివర్ బ్రంట్, అమీ జోన్స్(వికెట్ కీపర్), కేథరీన్ స్కివర్ బ్రంట్, సోఫీ ఎక్లెస్టోన్, షార్లెట్ డీన్, సారా గ్లెన్, లారెన్ బెల్
LIVE NEWS & UPDATES
-
ఇంగ్లండ్ చేతిలో భారత్ పరాజయం
ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. 152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులే చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలుపొందింది. భారత జట్టులో ఓపెనర్ స్మృతి మందాన హాఫ్ సెంచరీతో రాణించింది. మందాన 41 బంతుల్లో 52 పరుగులు చేసింది.
రిచా ఘోష్ అద్భుతంగా పోరాడింది. రిచా 34 బంతుల్లో 47 పరుగులు చేసింది. 4 ఫోర్లు, 2 సిక్సులు కొట్టింది. కానీ, మరో ఎండ్ లో ఆమెకు సహకారం కరువైంది. దీంతో ఆమె పోరాటం వృథా అయ్యింది. జట్టుని గెలిపించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
-
స్మృతి మందాన హాఫ్ సెంచరీ, ఆ వెంటనే ఔట్
భారత ఓపెనర్ స్మృతి మందాన రాణించింది. హాఫ్ సెంచరీ నమోదు చేసింది. అయితే కాసేపటికే ఔట్ అయ్యింది. మందాన 41 బంతుల్లో 57 పరుగులు చేసింది. 7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది. 105 పరుగుల జట్టు స్కోర్ వద్ద భారత్ 4వ వికెట్ కోల్పోయింది.
-
10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 62/3
152 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ 10 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మందాన నిలకడగా ఆడుతోంది. మరో ఎండ్ లో సహకారం కరువైంది. 62 పరుగుల వద్ద భారత్ 3వ వికెట్ కోల్పోయింది. షెఫాలి వర్మ(8), జెమీమా(13), హర్మన్ ప్రీత్ కౌర్(4) పరుగులు చేశారు.
-
ముగిసిన ఇంగ్లండ్ బ్యాటింగ్.. దంచికొట్టిన అమీ జోన్స్.. భారత్ టార్గెట్ 152
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో శనివారం ఇంగ్లండ్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఉమెన్ బ్యాటర్ అమీ జోన్స్ దంచి కొట్టింది. 27 బంతుల్లోనే 40 పరుగులు చేసింది. ఆమె స్కోర్ లో 2 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి.
ఆదిలోనే(29 పరుగులకే) మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ జట్టును బ్రంట్ ఆదుకుంది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 42 బంతుల్లో బ్రంట్ 50 పరుగులు చేసి ఔట్ అయ్యింది. ఆమె స్కోర్ లో 5 ఫోర్లు ఉన్నాయి.
భారత బౌలర్లలో రేణుకా సింగ్ 5 వికెట్లతో అదరగొట్టింది. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో వికెట్ తీశారు.
-
హమ్మయ్య.. బ్రంట్ ఔట్.. 5వ వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ జట్టు 5వ వికెట్ కోల్పోయింది. 120 పరుగుల వద్ద 5వ వికెట్ రూపంలో బ్రంట్ వెనుదిరిగింది. హాఫ్ సెంచరీతో ప్రమాదకరంగా మారిన బ్రంట్ ను శర్మ పెవిలియన్ పంపింది. మరో ఎండ్ లో అమీ జోన్స్ ధాటిగా ఆడుతోంది.
-
బ్రంట్ హాఫ్ సెంచరీ.. అమీ జోన్స్ దూకుడు
ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ జట్టును బ్రంట్ ఆదుకుంది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 41 బంతుల్లోనే బ్రంట్ 50 పరుగులు చేసింది. ఆమె స్కోర్ లో 4 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో అమీ జోన్స్ ధాటిగా ఆడుతోంది. బౌండరీలు బాదుతోంది. 80 పరుగుల వద్ద ఇంగ్లండ్ 4వ వికెట్ ను కోల్పోయింది.
-
11 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 80/4
ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ జట్టును బ్రంట్ ఆదుకుంది. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తోంది. మరో ఎండ్ లో ఆమెకు నైట్ అండగా నిలిచింది. కాగా, 80 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ ను కోల్పోయింది. నైట్(28)ను పాండే ఔట్ చేసింది.
-
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. పూజా వస్త్రకార్ 2, శిఖా పాండే ఒక వికెట్ పడగొట్టారు.
-
రోహిత్ శర్మను అధిగమించిన కౌర్
అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సవరించింది. అతడి కంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన ఘనత దక్కించుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి 149వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. రోహిత్ శర్మ ఇప్పటివరకు 148 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లు ఆడాడు.