NZ vs ENG : బ్రూక్ విధ్వంసం.. ర‌షీద్ మాయాజాలం.. రెండో టీ20లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ (NZ vs ENG) బోణీ కొట్టింది.

NZ vs ENG : బ్రూక్ విధ్వంసం.. ర‌షీద్ మాయాజాలం.. రెండో టీ20లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం

England won by 65 runs against New Zealand in 2nd T20

Updated On : October 20, 2025 / 4:11 PM IST

NZ vs ENG : న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా రెండో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై ఇంగ్లాండ్ ఘ‌న విజ‌యం సాధించింది.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య (NZ vs ENG ) రెండో టీ20 మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 236 ప‌రుగులు సాధించింది.

ఇంగ్లీష్ బ్యాట‌ర్ల‌లో ఫిల్ సాల్ట్ (85; 56 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌), హ్యారీ బ్రూక్ (78; 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీలు సాధించారు. ఆఖ‌రిలో టామ్ బాంట‌న్ (29 నాటౌట్; 12 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) వేగంగా ఆడాడు. జెమీస‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

IND vs SA : ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌.. రోజుకు 60 రూపాయ‌లే..

అనంత‌రం 237 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 18 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లాండ్ 65 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ బ్యాట‌ర్ల‌లో టిమ్‌ సీఫర్ట్‌ (39), మిచెల్‌ సాంట్నర్ (36), చాప్‌మన్‌ (28) లు ప‌ర్వాలేద‌నిపించారు.

మిగిలిన వారిలో జేమ్స్ నీష‌మ్ (17) ఒక్క‌డే రెండు అంకెల స్కోరు సాధించాడు. మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం కావ‌డంతో కివీస్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్ నాలుగు వికెట్లు తీశాడు. లియామ్ డాసన్, ల్యూక్ వుడ్, బ్రైడాన్ కార్స్ లు త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Sunil Gavaskar : ఆ ప‌ద్ద‌తి ఏంటో అర్థం కాదు.. రోహిత్‌, కోహ్లీ వైఫ‌ల్యంపై స్పందించిన గ‌వాస్క‌ర్‌.. ఆ ఇద్ద‌రు..

ఇరు జ‌ట్ల మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఆక్లాండ్‌ వేదికగా అక్టోబర్‌ 23న జరుగనుంది.