IND vs SA : ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌.. రోజుకు 60 రూపాయ‌లే..

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్, ద‌క్షిణాఫ్రికా (IND vs SA) జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs SA : ఈడెన్ గార్డెన్స్‌లో భార‌త్ వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌.. రోజుకు 60 రూపాయ‌లే..

Ticket Prices For India vs South Africa Test At Eden Gardens

Updated On : October 20, 2025 / 3:32 PM IST

IND vs SA : ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌కు రానుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆతిథ్య భార‌త్‌తో ద‌క్షిణాఫ్రికా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. టెస్టు సిరీస్‌తో ఈ ప‌ర్య‌ట‌న మొద‌లుకానుంది. న‌వంబ‌ర్ 14 నుంచి ఈ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుంది.

తొలి టెస్టు మ్యాచ్‌కు (IND vs SA) కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. న‌వంబ‌ర్ 14 నుంచి 18 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల‌ను బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ (క్యాబ్‌) సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

Sunil Gavaskar : ఆ ప‌ద్ద‌తి ఏంటో అర్థం కాదు.. రోహిత్‌, కోహ్లీ వైఫ‌ల్యంపై స్పందించిన గ‌వాస్క‌ర్‌.. ఆ ఇద్ద‌రు..

టికెట్ల ధ‌ర‌ల‌ను రోజుకు క‌నిష్టంగా రూ.60 గా నిర్ణ‌యించారు. ఐదు రోజులు టికెట్లు కావాలంటే రూ.300 చెల్పించాల్సి ఉంటుంది. గ‌రిష్టంగా రోజుకు 250గా నిర్ణ‌యించారు. ఐదు రోజుల‌కు కావాలంటే రూ.1250గా పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ యాప్, అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లను సొంతం చేసుకోవ‌చ్చు.

కాగా.. మ్యాచ్‌కు ఎలాంటి ఫిజిక‌ల్ టికెట్లు అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్ టికెట్ల ఉంటే చాలు, వారిని నేరుగా స్టేడింయ‌లోకి అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Smriti Mandhana : ‘గెలిచే మ్యాచ్‌లో నా వ‌ల్లే ఓడిపోయాం.. త‌ప్పంతా నాదే..’ స్మృతి మంధాన షాకింగ్ కామెంట్స్‌..

చివ‌రిసారిగా టీమ్ఇండియా 2019లో ఈడెన్‌గార్డెన్స్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది. బంగ్లాదేశ్‌తో జ‌రిగిన ఈ డే అండ్ నైట్ మ్యాచ్‌లో భార‌త్ గెలుపొందింది.