రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులో ఆర్సీబీ ఇలా రెడ్ జెర్సీ కాకుండా గ్రీన్ జెర్సీ ఎందుకు ధరించింది?
ఆయా మ్యాచుల్లో, నాలుగు విజయాలు సాధించగా, తొమ్మిది పరాజయాలను మూటగట్టుకుంది. మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది.

Pic: @RCBTweets (X)
ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జైపూర్‌లో ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రీన్ కలర్ జెర్సీతో ఆడుతోంది.
మొక్కలు నాటే విషయంలో అవగాహన కల్పించడం కోసం కొన్నేళ్లుగా ఆర్సీబీ ఇలా ఐపీఎల్‌లో ఓ మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీతో మైదానంలోకి అడుగుపెడుతుంది. ఆర్సీబీ ప్లేయర్లు గ్రీన్ జెర్సీ ధరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మిగతా అన్ని మ్యాచుల్లో మాత్రం తమ ఎరుపు రంగు జెర్సీనే వాడనుంది.
Also Read: సలేశ్వరం జాతర విశిష్టత ఏంటి? ఎలా వెళ్లాలి? అక్కడ ఏమేం నిషిద్ధం.. ఫుల్ డీటెయిల్స్
పర్యావరణ పరిరక్షణపై దీని ద్వారా అవగాహన కల్పించాలని ఆర్సీబీ ఇవాళ గ్రీన్ జెర్సీని వాడుతోంది. ఆర్సీబీ ‘గో గ్రీన్’కు మద్దతుగా ఐపీఎల్ 2011 సీజన్ నుంచి ఇలా గ్రీన్ జెర్సీని ఉపయోగిస్తోంది. ప్రజలు కార్బన్ ఫూట్‌ప్రింట్‌ను తగ్గించుకునేలా ఇలా ప్రోత్సహిస్తోంది. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో గ్రీన్ జెర్సీని ధరించి ఆడింది.
అంతకు ముందు, 2011 నుంచి 2019 వరకు ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన హోమ్ మ్యాచ్‌లో మాత్రమే ఈ గ్రీన్ జెర్సీని ధరించింది. 2020, 2021, 2022లో ఐపీఎల్ మ్యాచులు కరోనా వల్ల బయో-బబుల్‌లో జరిగాయి. ఆ సమయంలోనూ ప్రతి సీజన్‌లో ఓ మ్యాచులో గ్రీన్ జెర్సీలు ధరించి ఆ జట్టు ఆడింది.
ప్రస్తుత మ్యాచును వదిలేస్తే, మొత్తం మీద ఆర్సీబీ మొత్తం 14 మ్యాచ్‌లలో గ్రీన్ కిట్ ధరించింది. ఆయా మ్యాచుల్లో, నాలుగు విజయాలు సాధించగా, తొమ్మిది పరాజయాలను మూటగట్టుకుంది. మరొకటి వర్షం కారణంగా రద్దు అయింది. ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేసింది.