Asia Cup 2023 : మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిన ఫ్ల‌డ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీక‌ట్లోనే ఆడించేవాళ్లా..?

ఆసియాక‌ప్ (Asia Cup) 2023లో మ్యాచులు ఆసక్తిక‌రంగానే సాగుతున్నాయి. వాస్త‌వానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండ‌గా బీసీసీఐ ఎట్టి ప‌రిస్థితుల్లో భార‌త జ‌ట్టును పాక్‌కు పంపేది లేదంటూ తేల్చి చెప్ప‌డంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హిస్తున్నారు.

Asia Cup 2023 : మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిన ఫ్ల‌డ్ లైట్లు.. టోర్నీ మొత్తం చీక‌ట్లోనే ఆడించేవాళ్లా..?

Asia Cup 2023

Asia Cup : ఆసియాక‌ప్ (Asia Cup) 2023లో మ్యాచులు ఆసక్తిక‌రంగానే సాగుతున్నాయి. వాస్త‌వానికి ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండ‌గా బీసీసీఐ ఎట్టి ప‌రిస్థితుల్లో భార‌త జ‌ట్టును పాక్‌కు పంపేది లేదంటూ తేల్చి చెప్ప‌డంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో పాక్ నాలుగు మ్యాచుల‌కు శ్రీలంక తొమ్మిది మ్యాచుల‌కు ఆతిథ్యం ఇస్తోంది.

ఈ టోర్నీలో లీగ్ ద‌శ ముగియ‌గా బుధ‌వారం నుంచి సూప‌ర్‌-4 ద‌శ మొద‌లైంది. సూప‌ర్‌-4లో మొద‌టి మ్యాచులో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియం ఈ మ్యాచుకు ఆతిథ్యం ఇచ్చింది. కాగా.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత పాకిస్తాన్ ల‌క్ష్య ఛేద‌న‌కు దిగింది. పాక్ ఇన్నింగ్స్ ఐదు ఓవ‌ర్ల త‌రువాత స్టేడియంలో ఓ వైపు ఫ్ల‌డ్‌లైట్స్ ఒక్క‌సారిగా ఆరిపోయాయి. వెంట‌నే లైట్స్ వెలుగుతాయ‌ని అంతా భావించారు.

Shahid Afridi: గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన పాకిస్థాన్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిదీ .. ఏమన్నాడంటే..

అయితే.. చాలా సేప‌టి వ‌ర‌కు అవి వెల‌గ‌లేదు. ఆట‌గాళ్లు మైదానాన్ని వీడారు. దీంతో మ్యాచ్ దాదాపు అర‌గంట పాటు నిలిచిపోయింది. ఫ్ల‌డ్‌లైట్స్ వెలిగిన త‌రువాత మ్యాచ్ కొన‌సాగింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కాగా.. ఈ ఘ‌ట‌న నెట్టింట వైర‌ల్‌గా మారింది. భార‌త జ‌ట్టు అప్ప‌ట్లో పాక్‌కు రాని అన‌డంతో మాతో ఆడేందుకు భ‌య‌ప‌డుతున్నారా అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చీఫ్ నజామ్ సేథీ వ్యాఖ్య‌నించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఇదే విష‌యంపై నెటింట్ట సెటైర్లు ప‌డుతున్నాయి. నాలుగు మ్యాచుల‌నే స‌రిగ్గా నిర్వ‌హించ‌లేని పాకిస్తాన్ పూర్తి ఆసియా క‌ప్ ను నిర్వ‌హిస్తామ‌న‌డం పెద్ద జోక్ అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా ఒక‌వేళ ఆసియా క‌ప్ మొత్తం పాక్‌లోనే నిర్వ‌హించి ఉంటే.. అప్పుడు టోర్నీని చీక‌ట్లో నిర్వ‌హించేవారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

PAK vs BAN : బంగ్లాదేశ్ చిత్తు.. ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘ‌న విజ‌యం