Former cricketer and actor Salil Ankolas mother found dead in Pune flat
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి మాల అశోక్ అంకోలాగా తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆమె వయస్సు 77 సంవత్సరాలు. ఆమె పూణెలోని డెక్కన్ జింఖానా ప్రాంతంలో ఉన్న ప్రభాత్ రోడ్ కాంప్లెక్స్‌లో నివసించేది.
ఇంట్లో పని చేసే వ్యక్తి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తీయలేదు. దీంతో సమీపంలో నివసించే ఆమె కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పగా వారంతా వచ్చి తలుపు తెరిచి చూడగా మాల విగతజీవిగా కనిపించింది. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసినట్లుగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
Irani Cup : ఇరానీ కప్ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తరువాత
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. కాగా.. గత కొంతకాలంగా మాల మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు.
సలీల్ అంకోలా 1989 – 1997 మధ్య టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఓ టెస్టు, 20 వన్డేలు ఆడాడు. 29 సంవత్సరాల వయసులో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆ తరువాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 2000లో కురుక్షేత్రలో సంజయ్ దత్‌తో కలిసి నటించాడు. ఆ తరువాత సలీల్ చుర లియా హై తుమ్నే, రివాయత్, ఏక్తా మరియు ది పవర్ వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
IPL 2025 : ఆ రూల్‌ను మార్చండి మహాప్రభో.. బీసీసీఐకి ఫ్రాంఛైజీల వినతి!