Irani Cup : ఇరానీ కప్ విజేతగా ముంబై.. 27 ఏళ్ల తరువాత
ఇరానీ కప్ విజేతగా ముంబై నిలిచింది.

Mumbai win Irani Cup after 27 years
ఇరానీ కప్ విజేతగా ముంబై నిలిచింది. దీంతో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ముంబై ఇరానీ ట్రోఫీని ముద్దాడింది. లక్నో వేదికగా రెస్టాఫ్ ఇండియా, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా అజింక్యా రహానే సారథ్యంలోని ముంబైని విజేతగా ప్రకటించారు అంపైర్లు. అద్భుతమైన ద్విశతకంతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఓవర్ నైట్ స్కోరు 153/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌ను 329/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తనూష్ కోటియన్(114 నాటౌట్; 150 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్) శతకంతో చెలరేగాడు. పృథ్వీ షా (76), మోహిత్ అవస్థి(51) హాఫ్ సెంచరీలతో రాణించారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ ఆరు వికెట్లు తీశారు. చివరి సెషన్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రా అంగీకరించారు. దీంతో రెస్టాఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు.
Rinku Singh : రింకూ సింగ్ టాటూ చూశారా? దేవుడి ప్లాన్ అంటూ.. వీడియో
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్(222 నాటౌట్; 286 బంతుల్లో 25 ఫోర్లు, 4 సిక్సర్లు) డబుల్ సెంచరీ బాదాడు. అజింక్యా రహానే (97) , శ్రేయస్ అయ్యర్ (57) లు రాణించారు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 416 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(191; 292 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్ ) తృటిలో ద్విశతకం చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్(93 ; 121 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో ముంబైకి 121 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
IPL 2025 : ఆ రూల్‌ను మార్చండి మహాప్రభో.. బీసీసీఐకి ఫ్రాంఛైజీల వినతి!
Ajinkya Rahane wins yet another trophy.
– A legendary captain for Mumbai! 🙇♂️pic.twitter.com/12mPABQb3u
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2024