Rinku Singh : రింకూ సింగ్ టాటూ చూశారా? దేవుడి ప్లాన్ అంటూ.. వీడియో

టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Rinku Singh : రింకూ సింగ్ టాటూ చూశారా?  దేవుడి ప్లాన్ అంటూ.. వీడియో

Rinku Singhs gets a new Gods Plan tattoo

Updated On : October 5, 2024 / 2:43 PM IST

టీమ్ఇండియా న‌యా ఫినిష‌ర్ రింకూ సింగ్ కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. స‌ద‌రు వీడియోను భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రింకూ సింగ్ త‌న చేతిపై గాడ్స్ ప్లాన్ అని రాసుకున్న టాటూతో క‌నిపించాడు.

సూర్య కిర‌ణాల‌ను సూచించే వృతాకారం లోప‌ల దేవుడి ప్ర‌ణాళిక అని రాసుకున్నాడు. దీని వెనుక స్టోరీని అత‌డు బ‌య‌ట‌పెట్టాడు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో ఓ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో య‌శ్ ద‌యాల్ బౌలింగ్ లో వ‌రుస‌గా 5 సిక్స‌ర్లు బాది కోల్‌క‌తాకు అద్భుత విజ‌యాన్ని అందించాడు రింకూ. క‌వ‌ర్స్‌లో రెండు, రీజియ‌న్‌, ఓవ‌ర్ లాంగ్ ఆన్‌, ఓవ‌ర్ లాంగ్ ఆఫ్‌, డీఫ్ ఫైన్ లైగ్ దిశ‌ల‌లో సిక్స‌ర్లు బాదాడు. వీటిని సూచించే విధంగా టాటూ ఉంది.

IPL 2025 : ఆ రూల్‌ను మార్చండి మ‌హాప్ర‌భో.. బీసీసీఐకి ఫ్రాంఛైజీల విన‌తి!

‘నేను తరచుగా చెప్పే ఒక ప్రసిద్ధ సామెత అందరికీ తెలుసు.. దేవుని ప్రణాళిక. నేను కొన్ని వారాల క్రితం దాని ఆధారంగా పచ్చబొట్టు వేయించుకున్నాను.’ అని రింకూ సింగ్ చెప్పాడు.

‘దేవుని ప్రణాళిక కారణంగా ఇప్పుడు అందరూ నన్ను తెలుసుకున్నారు. టాటూలో నేను కొట్టిన 5 సిక్స్‌లు ఉన్నాయి. దాని కారణంగా నా జీవితం మారిపోయింది.. కాబట్టి నేను దానిని శాశ్వతంగా చేతిపై వేయించుకున్నాను.’ అంటూ ఆ వీడియోలో రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.