టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ల అక్కస్సు.. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, సలీమ్ మాలిక్ లు ఆరోపించారు.

టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ల అక్కస్సు.. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలు

former Pakistan captain Inzmam ul haq

Arshdeep Singh : సొంత జట్టులో లోపాలను సరిదిద్దుకోలేక పోతున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్లు.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియాపై లేనిపోని ఆరోపణలతో అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. టీమిండియా పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడ్డాడంటూ సత్యదూరమైన వ్యాక్యలతో నోరుపారేసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ -2024 టోర్నీలో భాగంగా సూపర్-8లో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఈ మ్యాచ్ లో అర్ష్‌దీప్ సింగ్ బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్ ఉల్ హక్, సలీమ్ మాలిక్ లు ఆరోపించారు.

Also Read : పసికూనలు కాదు.. పట్టుబట్టి నిలబడే తోప్‌లు.. టీ20 వరల్డ్ కప్‌లో ఆప్ఘానిస్తాన్ టీమ్ సునామీ

అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతి నుంచి రివర్స్ స్వింగ్ వచ్చేలా మిడిల్ ఓవర్లలో బంతిని టాంపరింగ్ చేశాడని వారు ఆరోపించారు. 24టీవీ ఛానెల్ డిబేట్ లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అర్ష్‌దీప్ సింగ్ 15వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు రివర్స్ స్వింగ్ వచ్చింది. కొత్త బంతితో తొందరగా రివర్ష్ స్వింగ్ రాదు.. అంటే 12 లేదా 13వ ఓవర్లో రివర్స్ స్వింగ్ కోసం బంతిని ట్యాంపరింగ్ చేశాడని అర్థమవుతుంది. అంపైర్లు కూడా ఆ విషయాన్ని గమనించక పోవటం విడ్డూరంగా ఉదంటూ ఇంజమామ్ ఉల్ హక్, మాలిక్ లు పేర్కొన్నారు.

Also Read : IND vs PAK: జూలై 19న భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ .. ఎక్కడంటే?

కొన్ని జట్ల విషయానికి వస్తే అంపైర్లు కళ్లు మూసుకుంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. అందులో భారత్ కూడా ఒకటి అంటూ వారు భారత్ పై తమ అక్కస్సును వెల్లగక్కారు. ఇదే.. పాక్ బౌలర్లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడితే పెద్దఎత్తున చర్చపెట్టేవారు అంటూ ఇంజమామ్ ఉల్ హక్ అన్నారు. పాక్ మాజీ కెప్టెన్ల ఆరోపణలపై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముందు పాకిస్థాన్ జట్టులో లోపాలను సరిదిద్దుకునేందుకు దృష్టిపెట్టండి.. అలాచేయడం మానుకొని టీమిండియాపై అక్కస్సు వెళ్లగక్కడం విచిత్రంగా ఉందంటూ సోషల్ మీడియాలో టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భారత్  జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఈనెల 27న ఇంగ్లాండ్ జట్టుతో సెమీఫైనల్ మ్యాచ్ లో టీమిండియా తలపడనుంది. ఆ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఈనెల 29న జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా జట్టు ఆడనుంది.