పాకిస్థాన్ ఇలాగే పేలవంగా ఆడడాన్ని కొనసాగించిందనుకో.. ఇక..: పాక్ మాజీ ఆల్‌రౌండర్ సంచలన కామెంట్స్
ప్రపంచ క్రికెట్ ఎంత ముందుకు వెళ్లిందో పాకిస్థాన్ గ్రహించాలని ఆయన అన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆ జట్టు ఆటతీరును తప్పుబట్టారు. క్రికెట్ ఎలా ఆడాలన్న దానిపై ఒక సరైన విధానం ఉందని, పాక్ ఆడిన పద్ధతి మాత్రం సరైనది కాదని చెప్పారు.
సరైన పద్ధతులు, వ్యూహాలను అనుసరించి క్రికెట్ ఆడాలని తెలిపారు. పాకిస్థాన్ జట్టు సరిగ్గా ఆడటం లేదని, ఓ క్రికెటర్‌గా తనను పాక్ ఆటగాళ్ల తీరు చాలా నిరాశపరిచిందని తెలిపారు. పాక్ మ్యాచులను చూడాలని కూడా అనిపించలేదని చెప్పారు.
Also Read: సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేస్తున్నారు.. ఆమె జీతం ఎంతో తెలుసా?
పాకిస్థాన్ ఇలాగే పేలవంగా ఆడడాన్ని కొనసాగిస్తే అభిమానులు క్రికెట్‌పై ఆసక్తిని కోల్పోతారని చెప్పారు. మ్యాచ్‌లు చూడటానికి తక్కువ మంది వస్తారని అన్నారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియం నిండిపోయిందని ఆయన గుర్తుచేశారు. ఎందుకంటే ఆ జట్లు క్రికెట్ బాగా ఆడతాయని అన్నారు.
ఒక టీమ్ ఆడుతున్నప్పుడు మొదట పిచ్, కండిషన్లను అంచనా వేయాలని చెప్పారు. ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం సాధించడానికి మొదటి నుంచీ కృషి చేయాలని అన్నారు. కేవలం 250 పరుగులు చేస్తే సరిపోదని చెప్పారు. ప్రపంచ క్రికెట్ ఎంత ముందుకు వెళ్లిందో పాకిస్థాన్ గ్రహించాలని ఆయన అన్నారు.
పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే గ్రూప్ దశలోనే టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఈ ఘోర వైఫల్యంపై అభిమానులు అలాగే క్రికెట్ నిపుణుల నుంచి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.