Khalid Latif : పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ కు భారీ షాక్ ఇచ్చిన డచ్ కోర్టు

అరెస్ట్ కాకపోయినా, విచారణకు రాకపోయినా పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ ఖలీద్ లతీఫ్ కు నెదర్లాండ్స్ కోర్టు షాక్ ఇచ్చింది.

Khalid Latif : పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ కు భారీ షాక్ ఇచ్చిన డచ్ కోర్టు

Former Pakistan cricketer sentenced to 12 years by Dutch court

Khalid Latif – Dutch Court : పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ ఖలీద్ లతీఫ్ కు నెదర్లాండ్స్ (Netherlands) కోర్టు షాక్ ఇచ్చింది. తమ దేశానికి చెందిన నాయకుడొకరిని హత్య చేసేందుకు ప్రేరేపించారన్న అభియోగాలతో అతడికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లతీఫ్.. నెదర్లాండ్స్ లో అరెస్ట్ కాకపోయినా, విచారణకు రాకపోయినా అతడికి జైలు శిక్ష విధించడం గమనార్హం. హత్యకు ప్రేరేపించడం, దేశద్రోహం, బెదిరింపులకు పాల్పడ్డరన్న ఆరోపణలతో విచారణ జరిపిన డచ్ కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించదని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

37 ఏళ్ల ఖలీద్ లతీఫ్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే నివసిస్తున్నారు. నెదర్లాండ్స్ కు చెందిన గీర్ట్ వైల్డర్స్‌ను (Geert Wilders) చంపితే రివార్డు ఇస్తామన్న వీడియోను 2018లో లతీఫ్.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహ్మద్ ప్రవక్త క్యారికేచర్ల పోటీ నిర్వహించడానికి సిద్ధ పడటంతో గీర్ట్ వైల్డర్స్‌ పై అప్పట్లో ముస్లింలు తీవ్రంగా స్పందించారు. గీర్ట్ వైల్డర్స్‌ ను హతమారిస్తే రివార్డు ఇస్తామని పలువురు ప్రకటించారు. దీంతో ఆ పోటీని రద్దు చేశారు. ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం. మహ్మద్ ప్రవక్త చిత్రాలను ముస్లింలు అంగీకరించరు.

Also Read: ప్రభుత్వ బస్సు ఎక్కి, టికెట్ తీసుకుని ప్రయాణించి.. ఇంటికి వెళ్లిన అనిల్ కుంబ్లే

డచ్ కోర్టు తీర్పుపై ఖలీద్ లతీఫ్ స్పందించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ కు ప్రాతినిథ్యం వహించిన లతీఫ్ 2017లో నిషేధానికి గురయ్యాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అతడిపై 5 ఏళ్ల నిషేధం కొనసాగుతోంది. 2010 ఆసియా గేమ్స్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

Also Read: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ఎంఎస్ ధోనీ.. వీడియో వైరల్