Anil Kumble: ప్రభుత్వ బస్సు ఎక్కి, టికెట్ తీసుకుని ప్రయాణించి.. ఇంటికి వెళ్లిన అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే ఫొటోను చూసిన నెటిజన్లు ఆయన చాలా నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేశారు.

Anil Kumble: ప్రభుత్వ బస్సు ఎక్కి, టికెట్ తీసుకుని ప్రయాణించి.. ఇంటికి వెళ్లిన అనిల్ కుంబ్లే

Anil Kumble

Updated On : September 11, 2023 / 5:04 PM IST

Anil Kumble – Bus Ride: మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఇవాళ బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సులో ప్రయాణించారు. విమానాశ్రయం నుంచి తన ఇంటికి చేరుకోవడానికి ఆయనకు ఇవాళ బస్సే దిక్కు అయింది. ఎందుకంటే ఇవాళ బెంగళూరు వ్యాప్తంగా ప్రైవేటు ట్రాన్స్‌పోర్టర్లు బంద్ నిర్వహిస్తున్నారు.

విమానం దిగి బయటకు వచ్చి చూస్తే అనిల్ కుంబ్లేకు ఏ ప్రైవేటు వాహనమూ కనపడలేదు. దీంతో సామాన్యుడిలా బస్సు ఎక్కి టికెట్ తీసుకుని ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ‘విమానాశ్రయం నుంచి ఇంటికి.. బీఎంటీసీ ట్రిప్’ అని ఆయన పేర్కొన్నారు. ఏసీ వోల్వో బస్సులో ఆయన ప్రయాణించినట్లు తెలుస్తోంది.

అనిల్ కుంబ్లే ఫొటోను చూసిన నెటిజన్లు ఆయన చాలా నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేశారు. కాగా, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సదుపాయాన్ని అందిస్తుండడంతో ఆ పథకాన్ని ప్రైవేటు బస్సులకూ విస్తరించాలని ఇవాళ నిరసన తెలుపుతున్నారు.

బైక్‌ ట్యాక్సీల సేవలను కూడా నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. శక్తి పథకం ద్వారా కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేసే సదుపాయం రావడంతో ప్రైవేటు రవాణా వ్యవస్థ నష్టపోతోందని అంటున్నారు.

IND vs PAK : ఆచితూచి ఆడుతున్న భార‌త బ్యాట‌ర్లు