Sachin Tendulkar 50th Birthday: 50వ వసంతంలోకి ‘మాస్టర్ బ్లాస్టర్’.. క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదేళ్లయినా తగ్గని క్రేజ్ ..

బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సచిన్.. తొలుత బౌలర్ అవుదామనుకున్నాడట. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం తన కోరికను కొడుకు అర్జున్ టెండూల్కర్‌తో నెరవేర్చుకుంటున్నాడు.

Sachin Tendulkar 50th Birthday: క్రికెట్ ప్రపంచానికి రారాజు.. క్రికెట్ గాడ్.. మాస్టర్ బ్లాస్టర్.. క్రికెట్ చరిత్రలో ఈ స్థాయిలో ప్లేర్లను సొంతం చేసుకున్న క్రికెటర్ మరెవరైనా ఉన్నారాఅంటే.. అది ఒక్క సచిన్ టెండుల్కర్‌కే సాధ్యమైందని తడబడకుండా చెప్పొచ్చు. అంతలా తన బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ప్లేయర్ సచిన్ టెండుల్కర్. అతను క్రీజులోకి వస్తే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. నాటి, నేటి క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ 50వ వసంతంలోకి అడుగు పెట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి పదేళ్లు అవుతున్నా ఇప్పటికీ సచిన్ స్టేడియంలో కనిపించారంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. అంతలా క్రికెట్ ప్రేమికుల గుండెల్లో తన బ్యాటింగ్ గుర్తులను నిలిపారు సచిన్.

Sachin Tendulkar on Blue Tick: మీరు నిజ‌మైన స‌చిన్ అన్న గ్యారెంటీ ఏంటి..? నెటీజ‌న్ ప్ర‌శ్న‌కు మాస్ట‌ర్ స‌మాధానం అదుర్స్‌

సచిన్ టెండూల్కర్‌ 50వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులు, ప్రముఖులు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పలువురు క్రికెటర్లు సచిన్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ హ్యాపీ బర్త్ డే సచిన్ జీ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని తెలియజేస్తున్నారు.

Sachin Tendulkar

కొడుకుతో ఆశ నెరవేరింది..

బ్యాటింగ్ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సచిన్.. తొలుత బౌలర్ అవుదామనుకున్నాడట. ఈ విషయాన్ని సచిన్ స్వయంగా చెప్పారు. ఫాస్ట్ బౌలర్ కావాలని అనుకున్నాడట. కానీ ఆస్ట్రేలియా దిగ్గజం డెన్నిస్ లిల్లీ సచిన్ కు బ్యాటింగ్ పైన దృష్టిపెట్టాలని చెప్పాడట. అప్పటి నుంచి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టిన సచిన్.. క్రికెట్ దేవుడుగా మారాడు. అయితే, తనకు ఫాస్ట్ బౌలర్ కావాలన్న కోరికను ఇప్పుడు తన కొడుకు అర్జున్ టెండూల్కర్‌తో సచిన్ నెరవేర్చుకున్నాడు.

Sachin Tendulkar

రికార్డుల రారాజు..

వన్డే క్రికెట్‌లో పరుగుల రారాజు సచిన్ టెండుల్కర్. అతన్ని మరే ఇతర బ్యాటర్ తో పోల్చేందుకు వీలులేదు. 1989 నుంచి 2013 వరకు 463 వన్డే మ్యాచ్‌లు ఆడిన సచిన్.. రికార్డుల మోత మోగించారు. వన్డేల్లో 49 సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ మాత్రమే. టెస్టుల్లోనూ అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ సచినే. 200 టెస్ట్ మ్యాచ్ 329 ఇన్నింగ్స్ ఆడిన సచిన్.. 51 సెంచరీలు చేశాడు. రెండు ఫార్మాట్లలోనూ సచిన్ 100 సెంచరీలు చేశాడు. ఇప్పటికే సచిన్ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. 1987 వరల్డ్ కప్ లో సచిన్ వాంఖెడే స్టేడియంలో ఇండియా – జింబాబ్వే మ్యాచ్‌కు బాల్ బాయ్‌గా ఉన్నాడు. 19ఏళ్ల వయస్సులోనే కౌంటీలు ఆడిన ఫస్ట్ ఇండియా క్రికెటర్ సచిన్. వన్డే క్రికెట్ చరిత్రలో ఫస్ట్ డబుల్ సెంచరీ సచిన్ పేరుపైనే ఉంది.

Sachin Tendulkar

సచిన్ టెండూల్కరే మొదటి వ్యక్తి..

సచిన్ టెండుల్కర్ అంటే అందరికీ గౌరవం. ఎలాంటి వివాదాలకు పోకుండా అందరి అభిమానం పొందిన క్రీడాకారుడు టెడూల్కర్. భారత్‌లో భారతరత్న పొందిన మొదటి క్రీడాకారుడు సచిన్. వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు (9) పొందిన క్రికెటర్ సచిన్. రాజ్యసభకు నామినేట్ అయిన ఫస్ట్ క్రికెటర్ కూడా సచినే. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సచిన్ ను కెప్టెన్ ర్యాంక్ హోదాతో గుర్తించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో థర్డ్ అంపైర్ ద్వారా ఔట్ అయిన ఫస్ట్ క్రికెటర్ సచినే. 1992లో సౌతాఫ్రికా టెస్టులో జాంటీ రోడ్స్ తో కు సచిన్ రనౌట్ అయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు