T20I World Record: టీ20 వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఫ్రెంచ్ బ్యాట్స్‌మన్

ఫిన్‌లాండ్ వేదికగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. మూడో టీ20 వరల్డ్ కప్ 2024 యూరప్ సబ్ రీజనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత నమోదైంది. ఫ్రెంచ్ ఓపెనింగ్ బ్యాటర్ గుస్తవ్ మెక్కియోన్ 18 సంవత్సరాల 280రోజులకే టీ20 సెంచరీ నమోదు చేశాడు.

T20I World Record: టీ20 వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన ఫ్రెంచ్ బ్యాట్స్‌మన్

World Record

Updated On : July 26, 2022 / 8:47 PM IST

 

 

T20I World Record: ఫిన్‌లాండ్ వేదికగా వరల్డ్ రికార్డ్ బ్రేక్ అయింది. మూడో టీ20 వరల్డ్ కప్ 2024 యూరప్ సబ్ రీజనల్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత నమోదైంది. ఫ్రెంచ్ ఓపెనింగ్ బ్యాటర్ గుస్తవ్ మెక్కియోన్ 18 సంవత్సరాల 280రోజులకే టీ20 సెంచరీ నమోదు చేశాడు. స్విట్జర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లోనే 109 పరుగులు నమోదు చేయడం విశేషం.

2019లో ఐర్లాండ్‌పై 62 బంతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ చేసిన 162* పరుగులతో 20 ఏళ్ల 337 రోజులతో మెక్‌కీన్ డాషర్ హజ్రతుల్లా జజాయ్ రికార్డును రెండేళ్లకే బద్దలు కొట్టాడు. సెంచరీ చేసినప్పటికీ, 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది మెక్ కీన్ జట్టు. చివరి బాల్ వరకూ పోరాడిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.

స్విస్ కెప్టెన్ ఫహీమ్ నజీర్ 46 బంతుల్లో 67 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. చివరి ఓవర్‌లో అలీ నయ్యర్ వీరోచిత ప్రదర్శన విజయాన్ని జట్టుకు విజయాన్ని అందించాయి.

Read Also: రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ చూశారా..

T20I సెంచరీ సాధించిన చిన్న వయస్సు ప్లేయర్

* గుస్తావ్ మెక్‌కీన్ – 18సంవత్సరాల 280రోజులు, ఫ్రాన్స్ వర్సెస్ స్విట్జర్లాండ్, వంతా, 2022

* హజ్రతుల్లా జజాయ్ – 20సంవత్సరాల 337రోజులు, ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్, డెహ్రాడూన్, 2019

* శివకుమార్ పెరియాళ్వార్ – 21సంవత్సరాల 161రోజులు రొమెనియా వర్సెస్, టర్కీ కౌంటీ 2019

* ఆర్కిడీ టుయిసెంగె 21సంవత్సరాల 161రోజులు, కిగాలీ, 2021

* దీపేంద్ర సింగ్ ఐరీ, 22సంవత్సరాల 68రోజులు, నేపాల్ వర్సెస్ మలేషియా, ఖాట్మండు, 2022