Neeraj Chopra: డబ్బు.. ఫ్రీ ట్రావెల్.. కార్.. స్వర్ణ విజేతపై కాసుల వర్షం

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ టాక్ ఆఫ్ ద టౌన్ మారిపోయాడు. యావత్ దేశమంతా ఎక్కడ చూసినా అతనిపై చర్చనే. శనివారం సాధించిన ఈ ఫీట్ ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది కాబట్టే.. మెడల్ సాధించినప్పటి నుంచి ప్రతి క్షణం వార్తల్లో నిలుస్తున్నాడు.

Neeraj Chopra: డబ్బు.. ఫ్రీ ట్రావెల్.. కార్.. స్వర్ణ విజేతపై కాసుల వర్షం

Neeraj Chopra

Updated On : August 9, 2021 / 6:19 PM IST

Neeraj Chopra: ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, జావెలిన్ త్రోయర్ టాక్ ఆఫ్ ద టౌన్ మారిపోయాడు. యావత్ దేశమంతా ఎక్కడ చూసినా అతనిపై చర్చనే. శనివారం సాధించిన ఈ ఫీట్ ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది కాబట్టే.. మెడల్ సాధించినప్పటి నుంచి ప్రతి క్షణం వార్తల్లో నిలుస్తున్నాడు.

రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రముఖులంతా రివార్డులు ప్రకటించి నీరజ్ కు నీరాజనాలు పలుకుతున్నారు. రూ.20 నుంచి 30లక్షల వరకూ ఉండే ఎండోర్స్ మెంట్ ఫీజు కూడా వెయ్యి రెట్టు పెరిగి రూ.2.5కోట్ల వరకూ వెళ్లింది.

హర్యానా ప్రభుత్వం గోల్డ్ సాధించాడని తెలిసిన వెంటనే రూ.6కోట్ల వరకూ ప్రకటించడంతో పాటు క్లాస్ 1 కేటగిరీ గవర్నమెంట్ జాబ్ కూడా ఇచ్చింది.

* పంజాబ్ గవర్నమెంట్ రూ.2కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.

* మణిపూర్ క్యాబినెట్ రూ.కోటి నగదు రివార్డు అందజేస్తామని హామీ ఇచ్చింది.

* బీసీసీఐ రూ.1కోటి ఇస్తామని వెల్లడించింది.

* ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ రూ.కోటి ఇస్తున్నట్లు గోల్డ్ గెలిచిన రోజే తెలిపింది.

* ఆనంద్ మహీంద్రా తన సొంత అకౌంట్ నుంచి XUV 700ను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

* ఇండిగో ఎయిర్ లైన్స్ సంవత్సరం పాటు ఉచిత ప్రయాణం ప్రకటించింది.

* ఇండియా ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ.. BYJUs రూ.2కోట్ల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది.