Virat Kohli- Sourav Ganguly
Sourav Ganguly- T20 World Cup 2024 : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్ 2023ను తృటిలో చేజార్చుకున్న టీమ్ఇండియా ఇప్పుడు టీ20 ప్రపంచకప్ 2024 పై దృష్టి సారించింది. జూన్‌లో జరగనున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా కూర్పు ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ సంగతి కాస్త పక్కన బెడితే.. అసలు కెప్టెన్ ఎవరో అన్న సంగతి కూడా తెలియడం లేదు. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా తరుపున మరో మ్యాచ్ ఆడలేదు.
ఈ క్రమంలో టీ20లకు హార్దిక్ పాండ్య నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలోనే రోహిత్, కోహ్లీలు వన్డేలపై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు నెలలో టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుండంతో ఇప్పుడు వారిద్దరి టీ20 భవితవ్యం పై చర్చ మొదలైంది. రోహిత్ నాయతక్వంలోనే టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా బరిలోకి దిగనుందా..? లేక హార్దిక్ సారథ్యంలోనే ఆడనుందా..? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
Flash Flood : ఇదేందిదీ.. వర్షం లేదు.. అయినా పిచ్ పై వరద.. వీడియో వైరల్
కీలక వ్యాఖ్యాలు చేసిన సౌరవ్ గంగూలీ..
ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ తప్పక తుది జట్టులో ఉండాలన్నాడు. రోహిత్ శర్మ నాయత్వంలోనే భారత్ బరిలోకి దిగాలన్నాడు. కోహ్లీ ఓ అద్భుత ఆటగాడని గంగూలీ కితాబు ఇచ్చాడు.
Ganguly said “Rohit Sharma should be the captain in the T20I World Cup”. [RevSportz] pic.twitter.com/AnDhfuAf3r
— Johns. (@CricCrazyJohns) January 7, 2024
అఫ్గానిస్తాన్ మూడు మ్యాచుల టీ20 సిరీసే టీ20 ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా ఆడనున్న చివరి సిరీస్ కావడం గమనార్హం. ఈ సిరీస్ తరువాత ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది. ఆ తరువాత ఐపీఎల్ జరగనుంది. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
Kieron Pollard : ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్‌కు మద్దతుగా పొలార్డ్..! అవసరం తీరగానే..
అఫ్గానిస్తాన్‌తో జనవరి 11 నుంచి ఆరంభం కానున్న టీ20సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ కూడా ఈ ఫార్మాట్ కోసం తిరిగి జట్టులోకి వస్తారని భావిస్తున్నారు.
భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* జనవరి 11న తొలి టీ20 – మొహాలి
* జనవరి 14న రెండవ టీ20 – ఇండోర్
* జనవరి 17న మూడో టీ20 – బెంగళూరు