వెటకారమా గంగూలీ : ధోనీ రిటైర్‌మెంట్ ఏంటీ.. ఎన్నాళ్లయినా ఆడొచ్చు
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ ఎప్పుడు? గతేడాది సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన సిరీస్‌లోనే ధోనీ రిటైర్ అయిపోతున్నాడంటూ విమర్శలు వచ్చాయి.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ ఎప్పుడు? గతేడాది సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన సిరీస్‌లోనే ధోనీ రిటైర్ అయిపోతున్నాడంటూ విమర్శలు వచ్చాయి.
కొద్ది రోజుల భారత క్రికెట్‌లో నలుగుతోన్న ప్రశ్న.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్‌మెంట్ ఎప్పుడు? గతేడాది సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన సిరీస్‌లోనే ధోనీ రిటైర్ అయిపోతున్నాడంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పటికే క్రికెట్ ప్రముఖులంతా మహీ రిటైర్మెంట్‌పై స్పందించారు. తాజాగా ఆ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా చేరిపోయాడు.
Read Also : బాహుబలి కంటే పెద్ద కుట్ర ఇది : డేటా లీక్ పై చంద్రబాబు
క్రికెట్ ప్రపంచమంతా వరల్డ్ కప్ తర్వాత ధోనీ రిటైర్ అయిపోతాడని భావిస్తుంది.. కానీ, గంగూలీ మాత్రం దానికి విరుద్ధంగా కామెంట్లు చేస్తున్నాడు. అతనికి వయస్సుతో సంబంధం లేదని ప్రతిభను బట్టి రిటైర్మెంట్ ఉండాలని చెప్పుకొస్తున్నాడు. కీపింగ్.. బ్యాటింగ్ అనేవి ఏజ్‌తో ఆధారపడి ఉండదని వెల్లడించాడు.
‘ఎంఎస్ దోనీ.. వరల్డ్ కప్ తర్వాత కంటిన్యూ అవ్వొచ్చు. ఒకవేళ ప్రపంచ కప్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బాగా రాణిస్తే.. అతను రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏముంది. టాలెంట్ ఉన్న వాళ్లకు వయస్సుతో సంబంధం లేదు’ అని గంగూలీ వివరించాడు.
‘మహేంద్ర సింగ్ ధోనీని విమర్శించడానికి ఎవరూ సరిపోరు. అతని గురించి మాట్లాడే ముందు మీకు క్రికెట్ గురించి ఏమైనా తెలుసానని ఆలోచించుకోండి. ధోనీ.. సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌లతో సమానం. ఇలాంటి 30..40ఏళ్లకు ఒకసారి వస్తారు. అతను ఆటకే ఆభరణం లాంటి వాడు. నెంబర్ వన్ టెస్టు జట్టు కెప్టెన్.. రెండు ప్రపంచ కప్‌లు గెలుచుకున్న కెప్టెన్’ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు రవిశాస్త్రి కామెంట్ చేశాడు.
Read Also : ఎన్నికల బరిలోకా ? ప్రచారానికా ? : బాబుతో కౌశల్