బీజేపీ ఢిల్లీ అభ్యర్థిగా గౌతం గంభీర్?

బీజేపీ ఢిల్లీ అభ్యర్థిగా గౌతం గంభీర్?

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఏప్రిల్-మేలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఢిల్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మీనాక్షీ లేఖి ఎంపీగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీలోని 7 ఎంపీ సీట్లలో ఒకటి గంభీర్ దక్కుతుందనే వార్తలు రావడంతో గౌతీ అభిమానులంతా సంబరాల్లో మునిగిపోయారు. 
Read Also : అనంత టీడీపీలో టికెట్ చిచ్చు : వైసీపీలోకి గోవిందరెడ్డి

గతేడాది డిసెంబర్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన గౌతం గంభీర్.. ఇటీవల పద్మ శ్రీ అవార్డు దక్కించుకున్నాడు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పంజాబ్‌లోని అమృతసర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీకి ప్రచారకర్తగానూ గంభీర్ సేవలందించారు.  

సోషల్ మీడియాలో వస్తోన్న రూమర్లకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి గంభీర్ చేసే పోస్టులు. ఖాళీ దొరికినప్పుడల్లా సమాజసేవలో మునిగిపోయే గంభీర్.. ఇలా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో ‘స్టార్ట్ ఏ న్యూ ఇన్నింగ్స్’ (కొత్త ఇన్నింగ్స్ మొదలవబోతోంది) అంటూ ట్వీట్ చేసి కాసేపట్లోనే దానిని తొలగించాడు. 
Read Also : బాపట్ల వైసీపీలో విభేదాలు : కోన v/s చీరాల గోవర్థన్ రెడ్డి