GT vs DC: 204 పరుగుల లక్ష్యాన్ని ఇలా ఛేదించిన గుజరాత్ టైటాన్స్
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

Pic: @IPL (X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచులో జీటీ టీమ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు ధాటిగా ఆడారు.
సాయిసుదర్శన్ 36, శుభ్‌మన్ గిల్ 7, జోస్ బట్లర్ 97 (నాటౌట్), రుథర్‌ఫర్డ్ 43, రాహుల్ తెవాటియా 11 (నాటౌట్) పరుగులు బాదారు. దీంతో 19.2 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ స్కోరు 204గా నమోదైంది. గుజరాత్ టీమ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ టైటాన్స్
సాయి సుదర్శన్, శుభమన్ గిల్, జోస్ బట్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్
అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్