పాండ్యాకు కొడుకు పుట్టాడు.. కోహ్లీ నీ సంగతేంటి!!

పాండ్యాకు కొడుకు పుట్టాడు.. కోహ్లీ నీ సంగతేంటి!!

Updated On : July 31, 2020 / 7:35 PM IST

టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి అయిన సందర్భంగా కొడుకు ఫొటోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సంతోషాన్ని పంచుకున్నాడు. నటాషాకు పాండ్యాల ప్రేమకు గుర్తుగా కొడుకు పుట్టాడని పోస్టు చేశాడు. పాండ్యా తండ్రయ్యాడు.. బాగానే ఉంది. మరి కోహ్లీ ఎందుకొచ్చాడు మధ్యలో..

నెటిజన్లు మెమేస్ చేయడంలో ఎంత స్పీడుగా ఉంటారో తెలిసిందేగా.. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల పిల్లల సంగతేంటి.. మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నామని విరుష్కా జోడీని అడుగుతున్నారు అభిమానులు. నిజానికి ఈ జోకులన్నీ పెళ్లి అయినవారికైతే కామన్ యే.

పెళ్లి అయిన వారు మగ, ఆడ ఎవరినైనా సరే పిల్లల సంగతేంటి.. ఇంకా పిల్లలు లేరా అని అడిగేవారే కనిపిస్తారు కదా. ఇలాగే కోహ్లీ లైట్ తీసుకుంటాడా.. ఏదైనా కౌంటర్ వేస్తాడా అనేది చూడాలి మరి.