ఐపీఎల్ షాకింగ్ న్యూస్: నోటీసులు అందుకున్న హార్దిక్.. రాహుల్‌

బీసీసీఐ అంబుడ్స్‌మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి.

ఐపీఎల్ షాకింగ్ న్యూస్: నోటీసులు అందుకున్న హార్దిక్.. రాహుల్‌

Updated On : April 1, 2019 / 1:52 PM IST

బీసీసీఐ అంబుడ్స్‌మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి.

బీసీసీఐ అంబుడ్స్‌మన్ (రిటైర్డ్) జస్టిస్ డికె జైన్ ఆధ్వర్యంలో టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షోలో పాల్గొన్న రాహుల్.. పాండ్యా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీసీసీఐ స్పందించి రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్ విధించింది. ఆ తర్వాత రాహుల్ టీమిండియాలో కొనసాగుతున్నప్పటికీ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన పాండ్యా గాయం కారణంగా దూరమయ్యాడు. 
Read Also : ICC వరల్డ్ కప్ జట్టు ప్రకటించే తేదీ ఎప్పుడంటే..

ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లో ఆడుతున్న కేఎల్ రాహుల్.. ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోన్న హార్దిక్ పాండ్యాలకు అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసింది. టీవీ షో వివాదంపై మరిన్ని వివరాల కోసం ముందుస్తు విచారణలో భాగంగా వారిని హాజరుకావాలని పేర్కొంది. వీటిపై స్పందించిన హార్దిక్.. రాహుల్‌లు పర్సనల్‌గా తమ బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాలేమని సమయం కావాలంటూ రిక్వెస్ట్ చేశారు. 

జస్టిస్ జైన్ మాట్లాడుతూ.. ‘హార్దిక్.. రాహుల్‌లకు వారం క్రితమే నోటీసులు జారీ చేశాం. విచారణకు వారు కూడా ఉండాలని ఆదేశించాం. సహజ న్యాయం ప్రకారం. వారి వాదనను వినాల్సి ఉంది. విచారణకు హాజరై వారి వాదనను వినిపించాల్సిన బాధ్యత వారిదే. ఎప్పుడు వస్తారో చూడాలి’ అని తెలిపారు. 
Read Also : IPL 2019: రహానె దొరికిపోయాడు.. రూ.12లక్షలు జరిమానా