Vinesh Phogat : హరియాణా ఎన్నికల్లో వినేశ్‌ ఫొగాట్ విజయం

మాజీ రెజ్ల‌ర్ వినేశ్ ఫొగాట్ రాజ‌కీయాల్లో త‌న తొలి అడుగును ఘ‌నంగా వేసింది.

Vinesh Phogat : హరియాణా ఎన్నికల్లో వినేశ్‌ ఫొగాట్ విజయం

Haryana Assembly Election Vinesh Phogat wins Julana seat

Updated On : October 8, 2024 / 4:09 PM IST

Vinesh Phogat : మాజీ రెజ్ల‌ర్ వినేశ్‌ ఫొగాట్ రాజ‌కీయాల్లో త‌న తొలి అడుగును ఘ‌నంగా వేసింది. హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం సాధించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జులానా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందింది. ఈ స్థానంలో బ‌రిలో నిలిచిన బీజేపీ అభ్య‌ర్థి యోగేశ్ కుమార్‌, ఆప్ అభ్య‌ర్థి క‌వితా రాణి లు వినేశ్ చేతిలో ఓట‌మి పాలైయ్యారు.

పారిస్ వేదిక‌గా జ‌రిగిన ఒలింపిక్స్ 2024లో ఫైన‌ల్ బౌట్‌కు కొన్ని గంట‌ల ముందు నిర్ణీత బ‌రువు కంటే 100 గ్రాములు అధిక బ‌రువు ఉండ‌డంతో వినేశ్‌ను డిస్ క్వాలిఫై చేశారు. ఈ బాధ‌లో వినేశ్ ఆట‌కు వీడ్కోలు చెప్పింది. ఆ త‌రువాత రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. పతకం దక్కకపోయినా ఎమ్మెల్యే పదవిని అలంకరించ‌నుంది. పతకాన్ని కోల్పోయిన వినేశ్‌కు జులానా ప్రజలు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు.

Swapnil Kusale : రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ ఇవ్వండి.. ఒలింపిక్స్ కాంస్య ప‌త‌క విజేత స్వ‌ప్నిల్ తండ్రి డిమాండ్‌..