Swapnil Kusale : రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ ఇవ్వండి.. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ తండ్రి డిమాండ్..
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తా చాటారు.

Swapnil Kusale father says his son should get 5 crore prize money flat in Pune
భారత షూటర్ స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 2024లో సత్తా చాటారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో 451.4 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో మహారాష్ట్రకు చెందిన ఈ యువ షూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు ప్రైజ్‌మనీగా ఇచ్చింది. దీనిపై స్వప్నిల్ తండ్రి సురేశ్ కుశాలె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హరియాణా ప్రభుత్వం ఆ రాష్ట్ర అథ్లెట్లకు ఇచ్చిన దానితో పోలిస్తే చాలా తక్కువ అని అన్నారు.
కొల్హాపుర్‌లో సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుక్కి రూ.5 కోట్లతో పాటు పుణెకు చెందిన బలేవాడీలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దగ్గరలో ఓ ఫ్లాట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. 72 సంవత్సరాల్లో మహారాష్ట్ర నుంచి ఒలింపిక్ పతకం సాధించిన రెండో వ్యక్తి స్వప్నిల్ అని అన్నారు.
IRE vs SA : ఐర్లాండ్ సంచలన విజయం.. ఆఖరి వన్డేలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా..
పారిస్ ఒలింపిక్స్‌లో హరియాణా నుంచి నలుగురు, మహారాష్ట్ర నుంచి ఒకరు పతకాలు సాధించారన్నారు. మన రాష్ట్రంతో పోల్చుకుంటే హరియాణా చాలా చిన్న రాష్ట్రం అని అయినప్పటికీ కూడా ప్రైజ్‌మనీ భారీగా ఇచ్చినట్లుగా తెలిపారు.
స్టేడియంకు దగ్గరలో స్వప్నిల్‌కు ఫ్లాట్ కేటాయిస్తే.. అతడు ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు చాలా సులభంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. 50 మీటర్లు 3 పొజిషన్స్ రైఫిల్ షూటింగ్ ప్రాంతానికి స్వప్నిల్ పేరు పెట్టాలి అని కోరారు.
IND vs BAN : ఢిల్లీ చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు.. కెప్టెన్ సూర్యకుమార్ డ్యాన్స్ చూశారా?
29 ఏళ్ల స్వప్నిల్ మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలోని కంబల్వాడి గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. 2015 అతడు సెంట్రల్ రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన తరువాత రైల్వే శాఖ అతడికి ప్రమోషన్ ఇచ్చింది.