IND vs BAN : ఢిల్లీ చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు.. కెప్టెన్ సూర్యకుమార్ డ్యాన్స్ చూశారా?
రెండో టీ20 మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది.

Suryakumar Yadav and co arrive in Delhi for IND vs BAN 2nd T20
IND vs BAN : మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక రెండో టీ20 మ్యాచులోనూ విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇక రెండో టీ20 మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక కానుంది.
రెండో టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత్, బంగ్లాదేశ్ జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి. భారత జట్టు ఢిల్లీకి చేరుకున్న వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీ చేరుకున్న భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది.
Dipa Karmakar : దీపా కర్మాకర్ సంచలన నిర్ణయం.. జిమ్నాస్టిక్స్‌కు వీడ్కోలు
ఎయిర్ పోర్టు నుంచి హోటల్ చేరుకునే వరకు దారి పొడవునా అభిమానులు నిలుచుకున్నారు. ఇక హోటల్‌కు చేరుకున్న అనంతరం డప్పులతో ఆటగాళ్లకు స్వాగతం లభించింది.
డప్పులకు అనుగుణంగా భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ రెండు స్టెప్పులను వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మైదానంలో 360 డిగ్రీలు షాట్లు ఆడే సూర్య.. డ్యాన్స్‌లోనూ ఇరగదీశాడని అంటున్నారు.
భారత్, బంగ్లాదేశ్ జట్లు బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా రెండో టీ20 మ్యాచులో తలపడనున్నాయి.
Gwalior ✈️ Delhi#TeamIndia have arrived for the 2nd #INDvBAN T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/jBWuxzD0Qe
— BCCI (@BCCI) October 8, 2024