IRE vs SA : ఐర్లాండ్ సంచలన విజయం.. ఆఖరి వన్డేలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా..
పసికూన ఐర్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Ireland claim just second ODI victory over South Africa
IRE vs SA : పసికూన ఐర్లాండ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. సోమవారం అబుదాబి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో, ఆఖరి వన్డే మ్యాచులో 69 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ గెలిచినప్పటికి తొలి రెండు వన్డేల్లో విజయాలు సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా.. వన్డేల్లో దక్షిణాఫ్రికా పై ఐర్లాండ్‌కు ఇది రెండో విజయం కావడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో పాల్ స్టిర్లింగ్ (92 బంతుల్లో 88 పరుగులు), హ్యారీ టెక్టర్ (48 బంతుల్లో 60 పరుగులు) హాఫ్ సెంచరీలు చేశారు. బాల్చిర్నీ (73 బంతుల్లో 45 పరుగులు) రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో విలిమయ్స్ నాలుగు వికెట్లు తీశాడు. బార్ట్‌మెన్, ఫెలుక్వాయో చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
IND vs BAN : ఢిల్లీ చేరుకున్న టీమ్ఇండియా ప్లేయర్లు.. కెప్టెన్ సూర్యకుమార్ డ్యాన్స్ చూశారా?
అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 46.1 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జేసన్ స్మిత్ (93 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 91 పరుగులు) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఓ వైపు సహచర ఆటగాళ్లు ఔటై పెవిలియన్‌కు చేరుకుంటున్నా కూడా జేసన్ ఒంటరి పోరాటం చేశాడు. ఐరీష్ బౌలర్లలో క్రెయిగ్, గ్రాహమ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. మార్క్ అడైర్ రెండు వికెట్లు సాధించాడు.
IRELAND BEAT SOUTH AFRICA IN AN ODI…!!!
– Ireland cricket shining well. 👏pic.twitter.com/Yd7SEtxFK4
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2024