ధోనీ రిటైర్ అయ్యాడా.. నెటిజన్లపై సర్ఫరాజ్ భార్య కౌంటర్ ఎటాక్

పాకిస్తాన్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను మూడు ఫార్మాట్ల నుంచి కెప్టెన్సీ నుంచి తొలగించింది పాక్ క్రికెట్ మేనేజ్మెంట్. గత శుక్రవారం టీ20కు బాబర్ అజామ్, టెస్టు ఫార్మాట్‌కు అజహర్ అలీలను కెప్టెన్లుగా ప్రకటించింది. దీంతో పాటు రాబోయే సిరీస్ లకు సర్ఫరాజ్ అహ్మద్ పేరు ఉండదంటూ వెల్లడించింది.
దీంతో నెటిజన్లు సర్ఫరాజ్ ఇక నువ్వు రిటైర్ అయిపో అంటూ కామెంట్టు చేయడం మొదలుపెట్టారు. సర్ఫరాజ్‌పై చేస్తున్న ట్రోలింగ్ లో భారత క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. దీంతో సర్ఫరాజ్ హార్య ఖుష్భత్ సర్ఫరాజ్ స్పందించారు.
‘అతను ఎందుకు రిటైర్ అవ్వాలి. 32ఏళ్లకే రిటైర్ అవ్వాలంటే ధోనీ వయస్సెంత? ఈ వయస్సులో ఉన్నప్పుడు అతను రిటైర్ అయ్యాడు. నా భర్త మళ్లీ తిరిగి అంతే స్ట్రాంగ్‍గా జట్టులో స్థానం దక్కించుకుంటారు. అతనొక ఫైటర్. నేనైనా, నా భర్త అయినా బాధపడ్డామంటే అది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం కారణంగానే. మూడు రోజుల ముందుగానే ఈ విషయం మాకు తెలుసు. దీనిని గౌరవిస్తాం. ఇది ముగింపు కాదు’ అని ఆమె రియాక్ట్ అయ్యారు.