SRH vs GT : ఉప్ప‌ల్‌లో మొద‌లైన వ‌ర్షం.. హైద‌రాబాద్ వ‌ర్సెస్ గుజ‌రాత్ మ్యాచ్ జ‌రిగేనా?

మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకిగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది.

SRH vs GT : ఉప్ప‌ల్‌లో మొద‌లైన వ‌ర్షం.. హైద‌రాబాద్ వ‌ర్సెస్ గుజ‌రాత్ మ్యాచ్ జ‌రిగేనా?

Heavy Rain in Uppal

Updated On : May 16, 2024 / 3:55 PM IST

Sunrisers Hyderabad vs Gujarat Titans : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు ఉప్ప‌ల్ వేదిక‌గా నేడు (మే 16 గురువారం) త‌ల‌ప‌డ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు వ‌ర్షం అడ్డంకిగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురుస్తోంది.

మ‌ధ్యాహ్నాం వ‌ర‌కు ఎండ‌, ఉక్క‌పోత‌తో స‌త‌మ‌తం అయిన హైద‌రాబాద్ న‌గ‌రంలో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బడింది. కూకట్‌పల్లి, మియాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్‌, కోఠి, బేగంబజార్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్, హైటెక్‌సిటీ, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

Bhuvaneshwar Kumar : భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌కు షాక్‌.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ట్రెంట్ బౌల్ట్ ఒకే ఒక్క‌డు..

దాదాపు రెండు గంట‌ల పాటు వర్షం కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో మ్యాచ్ జ‌రుగుతుందా లేదా అన్న అనుమానాలు నెల‌కొన్నాయి. అయితే.. ఉప్ప‌ల్‌లో అత్యాధునిక డ్రైనేజీ వ్య‌వ‌స్థ ఉంది. మ్యాచ్‌కు మొద‌లైయ్యేందుకు మ‌రో మూడు గంట‌లకు పైగా స‌మ‌యం ఉంది. ఈ క్ర‌మంలో వ‌ర్షం ఆగిన త‌రువాత సాధ్య‌మైనంత త‌క్కువ స‌మ‌యంలో మ్యాచ్‌కు మైదానాన్ని సిద్ధం చేయొచ్చు.

పూర్తి మ్యాచ్ జ‌ర‌గ‌క‌పోయినా కొన్ని ఓవ‌ర్ల మ్యాచ్ అయినా జ‌రిగే సూచ‌న‌లు ఉన్నాయి. అయితే.. వ‌ర్షం తెరిపినివ్వ‌క‌పోతే ర‌ద్దు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అదే జ‌రిగితే ఇరు జ‌ట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు.

IPL 2024 playoffs : ఏ జ‌ట్టుకు ఎంత శాతం అవ‌కాశమంటే? ఎస్ఆర్‌హెచ్‌ 87.3%, సీఎస్‌కే 72.7%, ఆర్‌సీబీ..