IPL 2024 playoffs : ఏ జట్టుకు ఎంత శాతం అవకాశమంటే? ఎస్ఆర్‌హెచ్ 87.3%, సీఎస్‌కే 72.7%, ఆర్‌సీబీ..
ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రత్యక్షప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్ల అవకాశాలను తెలియజేసింది.

IPL 2024 playoffs scenario SRH team has more than 87 per cent chance
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. మరో రెండు స్థానాల కోసం ఐదు జట్లు పోటీ పడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జట్లకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మిగిలింది. ఎస్ఆర్‌హెచ్ రెండు మ్యాచులు ఆడనుంది.
కాగా.. ఐపీఎల్ 2024 సీజన్‌ను ప్రత్యక్షప్రసారం చేస్తున్న స్టార్‌స్పోర్ట్స్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్ల అవకాశాలను తెలియజేసింది. స్టార్ స్పోర్ట్స్ అంచనా ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకునేందుకు 87.3 శాతం అవకాశం ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అదే విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కు 72.7 శాతం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు 39.3 శాతం, ఢిల్లీ క్యాపిటల్స్ అర్హత సాధించడానికి 0.7 శాతం అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్‌కి 0.2 శాతం అవకాశం ఉందని తెలియజేసింది.
The #Race2PlayoffsOnStar just got interesting after Delhi’s win over Lucknow! ?
With both Delhi and Lucknow facing an uphill battle, Bengaluru’s qualification chances have increased, and ????????? ??? ??????? ????? ???? ?? ??? ????????!… pic.twitter.com/FSHrAe59Zu
— Star Sports (@StarSportsIndia) May 14, 2024
చెన్నై సూపర్ కింగ్స్ ..
రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడింది. ఏడు మ్యాచుల్లో గెలవడంతో ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్‌రేట్ +0.528 గా ఉంది. తన చివరి మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధిస్తే చాలు ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టవచ్చు.
DC vs LSG : ఏమయ్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ సరే.. రాహుల్‌తో మళ్లీ ఏందిది..
ఒకవేళ ఓడిపోయినప్పటికీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఆర్‌సీబీ తన రన్‌రేట్‌ను దాటకుండా చూసుకోవాలి. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచుల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. లక్నో చివరి మ్యాచ్ గెలిచినా కూడా ఆ జట్టు రన్‌రేటు మైనస్‌లోనే ఉండే అవకాశం ఉంది. అప్పుడు చెన్నై ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్..
పాట్ కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడింది. ఏడు మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నెట్‌రన్‌రేటు +0.406 గాఉంది. ఇంకో రెండు మ్యాచులు గుజరాత్, పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది.
ఈ రెండింటిలో ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు ఎలాంటి సమీకరణం లేకుండా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ కూడా ఎస్ఆర్‌హెచ్‌కు అవకాశం ఉంటుంది. అప్పుడు మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా.. నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉండడం ఎస్ఆర్‌హెచ్‌కు కలిసివచ్చే అంశం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచింది. 12 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు నెట్‌రన్ రేటు +0.387 గా ఉంది. తన చివరి మ్యాచ్‌ను చెన్నైతో ఆడనుంది.
ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. నెట్‌రన్ రేటులో చెన్నైని అధిగమిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఇందుకు ఆర్‌సీబీ మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగులు, లక్ష్య ఛేదన అయితే 18.1 ఓవర్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై చేతిలో ఆర్‌సీబీ ఓడిపోతే ఇంటిదారి పట్టాల్సిందే.