Champions Trophy: ఆస్ట్రేలియాపై గెలిస్తే అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్ కు వెళ్తుందా..? ఇంగ్లాండ్ జట్టుపైనే ఆధారపడి ఉంటుంది.. ఎలా అంటే.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్ కు ఏ జట్లు వెళ్తాయనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Champions Trophy: ఆస్ట్రేలియాపై గెలిస్తే అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్ కు వెళ్తుందా..? ఇంగ్లాండ్ జట్టుపైనే ఆధారపడి ఉంటుంది.. ఎలా అంటే.

Afghanistan

Updated On : February 27, 2025 / 7:36 AM IST

Afghanistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రూప్-బి నుంచి సెమీఫైనల్స్ కు ఏ జట్లు వెళ్తాయనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. గ్రూప్ -ఏ నుంచి ఇప్పటికే ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్ కు వెళ్లాయి. ప్రస్తుతం నెట్ రన్ రేట్ ఆధారంగా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇండియా రెండో స్థానంలో నిలిచింది. మార్చి 2న జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్తుంది. అయితే, ఇంగ్లాండ్ జట్టుపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం సాధించడంతో గ్రూప్-బిలో సెమీఫైనల్స్ కు వెళ్లే జట్లపై ఇంకా సస్పెన్ష్ కొనసాగుతూనే ఉంది.

Also Read: Champions Trophy: పాకిస్థాన్‌లో కలకలం సృష్టించిన ఆఫ్గాన్ బ్యాటర్.. రికార్డుల మోత మోగింది.. తొలి బ్యాటర్ అతనే..

ఇంగ్లాండ్ జట్టుపై అఫ్గానిస్థాన్ అద్భుత విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లలో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అఫ్గానిస్థాన్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు రెండు మ్యాచ్ లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్ కు చేరాలంటే శుక్రవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్ లో విజయం సాధించాలి. అయినా.. అఫ్గాన్ జట్టుకు సెమీ ఫైనల్స్ వెళ్లేందుకు అర్హత సాధించదు. శనివారం దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే అఫ్గాన్ సెమీ ఫైనల్స్ కు వెళ్తుంది.

Also Read: ENG vs AFG : వాటే మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం.. ఇంగ్లండ్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం..

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్లిలో మూడేసి పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం అఫ్గాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే సెమీస్ కు వెళ్తుంది. అఫ్గాన్ సెమీస్ అవకాశాలను కోల్పోతుంది. ఆ తరువాత శనివారం దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించినా దక్షిణాఫ్రికా సెమీస్ కు వెళ్తుంది.

ఒకవేళ అఫ్గాన్ జట్టుపై ఆస్ట్రేలియా ఓడిపోయి.. ఇంగ్లాండ్ జట్టుపై దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోతే.. రన్ రేట్ ఆధారంగా  దక్షిణాఫ్రికా జట్టు సెమీస్ కు వెళ్తుంది. అప్పుడు గ్రూప్-బి నుంచి అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు వెళ్తాయి.

Champions Trophy 2025 Table Group-B