Champions Trophy: సచిన్, గంగూలీ రికార్డులను అధిగమించిన అఫ్గానిస్థాన్ బ్యాటర్.. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ అతనే..
పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది.

Afghanistan
Ibrahim Zadran: పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలనం సృష్టించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ వీర విధ్వంసానికి ఇంగ్లాండ్ బౌలర్లు హడలెత్తిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడిన ఇబ్రహీ జాద్రాన్ పరుగుల వరద పారించాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. జాద్రాన్ విధ్వంసానికి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ అవకాశాలను కోల్పోయింది.
Also Read: ENG vs AFG : వాటే మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీలో సంచలనం.. ఇంగ్లండ్‌పై అఫ్ఘానిస్థాన్ ఘన విజయం..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం రాత్రి గ్రూప్-బిలో అఫ్గానిస్థాన్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థా జట్టులో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 146 బంతుల్లో 177 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. ఏకంగా ఆరు సిక్సులు, 12 ఫోర్లు కొట్టాడు. జద్రాన్ కు తోడు అజ్మతుల్లా ఒమర్ జామ్ (41), నవి (40) రాణించడంతో అఫ్గానిస్థాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 325 పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఆది నుంచి ఎదురుదెబ్బలే తగిలాయి. తక్కువ పరుగులకే ఓపెనర్లు ఔట్ అయ్యారు. కష్టాల్లో కూరుకుపోయిన ఇంగ్లాండ్ జట్టును విజయం వైపు నడిపించేందుకు రూట్ (120 పరుగులు) ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. జోస్ బట్లర్ (38), బెన్ డెక్కట్ (38) మినహా మిగిలిన బ్యాటర్లు పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యారు. దీంతో చివరి బాల్ వరకు నరాలుతెగే ఉత్కంఠను రేపిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అఫ్గాన్ బౌలర్లలో అజ్మతుల్లాహ్ ఒమర్జె ఐదు వికెట్లు పడగొట్టాడు.
జద్రాన్ రికార్డుల మోత..
♦ అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (177) అద్భుత బ్యాటింగ్ కు పలు రికార్డులు బద్దలయ్యాయి.
♦ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్ గా జద్రాన్ నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ (165) రికార్డును అతడు తుడిచిపెట్టాడు. డకెట్ ఈ టోర్నీలోనే ఆస్ట్రేలియాపై ఈ స్కోరు సాధించాడు.
♦ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన అఫ్గాన్ బ్యాటర్ గా జద్రాన్ రికార్డు నెలకొల్పాడు.
♦ ఐసీసీ టోర్నమెంట్లోఓ ఇన్నింగ్స్ లో 150పై స్కోరు చేసిన చిన్న వయస్కుడిగా (23ఏళ్లు) జద్రాన్ నిలిచాడు.
♦ ఐసీసీ టోర్నమెంట్లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక వ్యక్తిగత స్కోరును జద్రాన్ నమోదు చేశాడు.
♦ వన్డేల్లో ఇబ్రహీం జద్రాన్ కు ఇది ఆరో సెంచరీ.
♦ ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్ లో అప్గానిస్థాన్ జట్టు తన అత్యధిక స్కోరును నమోదు చేసింది.
A knock that went straight into the #ChampionsTrophy record books from Ibrahim Zadran 👏#AFGvENG ✍️: https://t.co/6IQekpiWp0 pic.twitter.com/Y4W8lJxifW
— ICC (@ICC) February 26, 2025
ఛాంపియన్స్ ట్రోఫీలో వ్యక్తిగత అత్యుత్తమ స్కోరు..
ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్థాన్) 177 పరుగులు ఇంగ్లాండ్ జట్టుపై (లాహోర్ 2025)
బెన్ డకెట్ (ఇంగ్లాండ్) 165 పరుగులు ఆస్ట్రేలియా జట్టుపై (లోహోర్ 2025)
నాథన్ ఆస్టల్ (న్యూజిలాండ్) 145 నాటౌట్ యూఎస్ఏ జట్టుపై (2004 ది ఓవల్)
ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే) 145 పరుగులు ఇండియా జట్టుపై (కొలంబో 2002)
సౌరవ్ గంగూలీ (భారతదేశం) 141 పరుగులు దక్షిణాఫ్రికా జట్టుపై (నైరోబి 2000)
సచిన్ టెండూల్కర్ (భారతదేశం) 141 పరుగులు ఆస్ట్రేలియా జట్టుపై (ఢాకా 1998)
గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా) 141 పరుగులు ఇంగ్లాండ్ జట్టుపై (సెంచూరియన్ 2009)