Prize Money : ఫిఫా వరల్డ్‌కప్ విజేత స్పెయిన్.. వామ్మో.. ఫ్రైజ్‌మనీ ఎంతో తెలుసా? అర్జెటీనా జట్టుకు కూడా వందల కోట్లు..
FIFA World Cup 2026 Prize Money : ఫిఫా వరల్డ్ కప్ 2026 విజేతగా స్పెయిన్ జట్టు నిలిచింది. తద్వారా భారీగా ఫ్రైజ్‌మనీ ఆ జట్టు అందుకోనుంది.
how much prize money spain and argentina earned FIFA world cup 2026
- ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్
- ఫైనల్లో 1-0తో అర్జెంటీనాపై విజయం
- విజేతకు రూ.492 కోట్లు ఫ్రైజ్‌మనీ
FIFA World Cup 2026 Prize Money : ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. అమెరికాలోని న్యూజెర్సీ మెట్‌లైఫ్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0 తేడాతో ఓడించి ప్రపంచ ఫుట్‌బాల్ కిరీటాన్ని రెండోసారి సొంతం చేసుకుంది.
Also Read : FIFA World Cup 2026 : స్పెయిన్ సూపర్ షో.. ప్రపంచ ఫుట్‌బాల్ సింహాసనంపై మరోసారి అధిరోహణ! పనిచేయని మెస్సీ మాయ!
నిర్ణీత 90నిమిషా ఆటలో ఇరు జట్లు గోల్ చేయలేక పోవడంతో మ్యాచ్ ఎక్స్ట్రా టైమ్‌కు వెళ్లింది. అదనపు సమయంలో గోల్‌తో టోరెస్ స్పెయిన్ హీరోగా నిలిచాడు. పెడ్రో పోరో కుడి వైపు నుంచి కొట్టిన క్రాస్ పాస్‌ను ‘డి’ ఏరియాలో నికో విలియమ్స్ హెడర్ షాట్‌తో వెనక్కి పంపించాడు. అక్కడేఉన్న ఫెరాన్ టోరెస్ అర్జెంటీనా గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ బంతిని లక్ష్యానికి చేర్చాడు. దాంతో స్పెయిన్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత అదనపు సమయంలో మిగిలిన క్షణాల్లో అర్జెంటీనాను నిలువరించి స్పెయిన్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. స్టార్లు లేకున్నా సమష్టిగా సత్తా చాటుతూ ఫుట్‌బాల్ జగజ్జేతగా నిలిచిన స్పెయిన్.. కలల కప్పును రెండోసారి సగర్వంగా ముద్దాడింది.
భారీగా ఫ్రైజ్‌మనీ..
ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టుకు భారీగా ఫ్రైజ్‌మనీ దక్కింది. మొత్తం ఫ్రైజ్‌మనీ రూ.6,306 కోట్లు కాగా.. ఛాంపియన్‌గా నిలిచిన స్పెయిన్ జట్టు 50 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.492 కోట్లు) బహుమతిగా అందుకుంది. ఇది ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో విజేతకు ప్రకటించిన అత్యధిక ప్రైజ్ మనీ కావడం గమనార్హం.
రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా జట్టు 33 మిలియన్ డాలర్లు (రూ.325 కోట్లు) అందుకుంది. మూడు స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు 29 మిలియన్ డాలర్లు (రూ.285కోట్లు), నాలుగో స్థానాల్లో నిలిచిన ఫ్రాన్స్ జట్టు 27మిలియన్ డాలర్లు (రూ.266కోట్లు) ఫ్రైజ్‌మనీ అందుకుంది. ఇందులో ప్రదర్శన ఆధారంగా ఇచ్చే ఫ్రైజ్ మనీతోపాటు ప్రతి అర్హత సాధించిన జట్టుకు టో్ర్నీ సన్నాహక ఖర్చుల కోసం ప్రత్యేక నిధులు కూడా ఉన్నాయి. ఇక క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన జట్లు రూ.182కోట్లు, ప్రిక్వార్టర్స్ లో వెనుదిరిగిన జట్టు రూ.144కోట్లు చొప్పున అందుకున్నాయి. గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన ప్రతి జట్టుకు రూ.105 కోట్లు లభించాయి.
ప్రపంచకప్ విజేతకు కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా భారీ నగదు బహుమతి కూడా లభించడం ఫుట్‌బాల్ చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. ఈ ప్రైజ్ మనీని ఆయా దేశాల ఫుట్‌బాల్ సమాఖ్యలకు ఫిఫా అందజేస్తుంది. అనంతరం ఆయా సమాఖ్యల నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, ఇతర అధికారులకు వాటా పంపిణీ చేస్తారు.
