Real vs AI Images : సానియా మీర్జా, మహ్మద్ షమీల ఏఐ చిత్రాలు వైరల్.. అసలు, నకిలీ ఫోటోలను ఇలా గుర్తించండి
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నకిలీ ఫోటోల బెడద ఎక్కువ అవుతోంది. వీటిలో ఏదీ నిజమైనదో, ఏది కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది.

How to Recognize Real vs AI Images here use these things
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నకిలీ ఫోటోల బెడద ఎక్కువ అవుతోంది. వీటిలో ఏదీ నిజమైనదో, ఏది కాదో తెలుసుకోవడం కష్టంగా మారింది. తాజాగా టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, సానియా మీర్జాలు దుబాయ్‌లో చక్కర్లు కొడుతున్నారని, వారిద్దరు పెళ్లి చేసుకున్నారంటూ పెళ్లి దుస్తుల్లో వారిద్దరు ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆ ఫోటోలు వాస్తవం కావు. అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రూపొందించిన ఫోటోలు.
ఏఐ సాంకేతికతో చేసిన ఫోటోలను ఎలా గుర్తించాలి?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన ఫోటోలు చాలా వరకు అసలైనవిగానే కనిపిస్తాయి. దీంతో వాటిని గుర్తించడం కాస్త కష్టమైన పనే.. అయితే.. కొన్ని విషయాలను గమనిస్తే మాత్రం వాటిని ఇట్టే గుర్తించవచ్చు.
ఫోటోల వివరాలపై శ్రద్ధ వహిస్తే.. ఏఐ రూపొందించిన చిత్రాలను జాగ్రత్తగా మీరు గమనిస్తే అందులో ఖచ్చితంగా ఏదో ఒకటి కనిపిస్తుంది. కళ్ళు లేదా దంతాలు లేదా వేళ్లు వింతగా ఉంటాయి. మరికొన్ని ఫోటోల్లో చెవులు కనిపించకుండా పోతుంటాయి.
బ్యాక్ గ్రౌండ్‌ని జాగ్రత్తగా గనిస్తే.. ఏఐ సాంకేతికతో రూపొందించిన చిత్రాల్లో కొన్ని అస్పష్టంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే.. వాస్తవ ప్రపంచంలో కనిపించని కొన్నింటిని అందులో చూడవచ్చు. ఉదాహరణకు వేసవి ఫోటోలో మంచు వంటివి కనిపిస్తుంటాయి.
నీడపై శ్రద్ధగా గమనిస్తే.. ఫోటోల్లోని నీడలపై దృష్టి పెట్టండి. వాస్తవానికి వస్తువు నీడ లైటింగ్‌కి ఎదురుగా ఉండాలి. అలా కాకుండా ఉండడం, అసలు నీడ వంటివి లేకుండా ఉంటే అవి నకిలీ ఫోటోలుగా గుర్తించాలి.
AI డిటెక్షన్ టూల్ సాయం.. ఏఐ సాంకేతికతో రూపొందించిన చిత్రాలను గుర్తించడంలో సహాయపడే అనేక ఆన్ లైన్ సాధనాలు ఉన్నాయి. వాటిని వినియోగించుకొని ఏదైనా ఫోటోను సైతం ఇట్టే కనిపెట్టేయవచ్చు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్.. గూగుల్‌లో ఏదైన ఫోటోని రివర్స్ సెర్చ్ చేయవచ్చు. అదే విధంగా గూగుల్ లెన్స్ ద్వారా ఈ ఫొటో గతంలో వినియోగించారా? లేదా వంటి విషయాలను కూడా తెలుసుకోవచ్చు.
Harmanpreet Kaur : హర్మన్ ప్రీత్ కౌర్ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో..