Uppal Stadium : లైన్ క్లియర్.. హైదరాబాద్ క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్

ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన హైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని టెన్షన్ పడ్డారు.

Uppal Stadium : లైన్ క్లియర్.. హైదరాబాద్ క్రికెట్ లవర్స్‌కు గుడ్ న్యూస్

Updated On : April 5, 2024 / 12:14 AM IST

Uppal Stadium : హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ కు లైన్ క్లియర్ అయ్యింది. కరెంటు కష్టాలు తొలగిపోయాయి. స్టేడియానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో శుక్రవారం జరగాల్సిన హైదరాబాద్, చెన్నైమ్యాచ్ కు అడ్డంకులు తొలగిపోయాయి. మ్యాచ్ నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది.

నాలుగైదు గంటల తర్వాత స్టేడియంకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. దీంతో శుక్రవారం హైదరాబాద్-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ యధాతథంగా జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా క్రికెట్ అభిమానులు నిరుత్సాహం చెందొద్దని.. ఉప్పల్ స్టేడియానికి కరెంటును పునరుద్ధరించిన విద్యుత్ శాఖ.. బకాయి బిల్లుల చెల్లింపునకు ఒక్కరోజు సమయం ఇచ్చింది.

కొన్ని నెలలుగా విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు స్టేడియానికి కరెంట్ కట్ చేశారు. శుక్రవారం నాటి కీలక మ్యాచ్ కు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం క్రికెట్ లవర్స్ లో ఆందోళన నింపింది. హైదరాబాద్, చెన్నై మ్యాచ్ జరుగుతుందా? లేదా? అని టెన్షన్ పడ్డారు. అయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపారు.

పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు స్టేడియానికి కరెంట్ ను పునరుద్ధరించారు. మరోవైపు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదైంది. బిల్లులు చెల్లించకుండానే కోటి 64 లక్షల విలువైన కరెంట్ వాడుకున్నారని విద్యుత్ శాఖ ఆరోపించింది.

Also Read : క్రికెట్‌లో పెను విషాదం.. ఆల్ రౌండ‌ర్ అరువా మృతి.. శోకసంద్రంలో ఆసియా-పసిఫిక్ క్రికెట్