ODI World Cup 2023 : ప్రపంచకప్ టికెల్ కావాలా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా టికెట్ల అమ్మకంపై ఐసీసీ ఫోకస్ పెట్టింది.
World Cup tickets registration : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ మరికొద్ది రోజుల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5 న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుండగా టికెట్ల అమ్మకంపై ఐసీసీ(ICC) ఫోకస్ పెట్టింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వాళ్లు టికెట్ల కొరకు వెబ్‌సైటులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ భారత స్వాత్రంత్య్ర దినోత్సవం అయిన నేటి(ఆగస్టు 15) మధ్యాహ్నాం 3.30 గంటల నుంచి ప్రారంభమైనట్లు వెల్లడించింది.
ఇలా రిజిస్టర్ చేసుకోండి
వెబ్‌సైట్‌లో టికెట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల 25 నుంచి టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. www.cricketworldcup.com/register సైట్‌లోకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సైట్‌లోకి వెళ్లగానే పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ, ఏ దేశానికి చెందిన వారు, ఏ మైదానంలో మ్యాచ్‌లను చూడాలని అనుకుంటున్నారు. ఏ దేశ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకుంటున్నారు అనే వివరాలు కనిపిస్తాయి. వాటిని నింపి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగానే వెంటనే మీకు మెయిల్ ద్వారా లేదంటే ఫోన్‌కు సమాచారం అందిస్తారు.
Asian Games 2023 : ఆసియా క్రీడల నుంచి తప్పుకున్న డిఫెండింగ్ ఛాంపియన్.. కారణమదే..?
ప్రపంచకప్‌కు టికెట్లు ఈ తేదీల్లో విక్రయించబడతాయి
ఆగస్ట్ 25 – నాన్ ఇండియా వార్మప్ మ్యాచ్‌లు, అన్ని నాన్-ఇండియా ఈవెంట్ మ్యాచ్‌లు
ఆగస్టు 30 – గౌహతి, త్రివేండ్రంలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
ఆగష్టు 31 – చెన్నై, ఢిల్లీ, పూణేలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 1 – ధర్మశాల, లక్నో,ముంబైలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 2 – బెంగళూరు, కోల్‌కతాలో జరిగే భారత మ్యాచుల టికెట్లు
సెప్టెంబర్ 3 – అహ్మదబాద్‌లో జరిగే భారత మ్యాచ్ టికెట్లు
సెప్టెంబర్ 15- సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచుల టికెట్లు లను విక్రయిస్తారు.
Virat Kohli : ఈ రోజు నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకం.. చిన్నప్పుడు ఏం చేసేవాడినంటే..?
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ప్రపంచకప్ మ్యాచులు జరగనున్నాయి. క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
?️ #CWC23 Ticket sales
? 25 August: Non-India warm-up matches and all non-India event matches
? 30 August: India matches at Guwahati and Trivandrum
? 31 August: India matches at Chennai, Delhi and Pune
? 1 September: India matches at Dharamsala, Lucknow and Mumbai
? 2… pic.twitter.com/GgrWMoIFfA— ICC (@ICC) August 15, 2023