IND vs NZ: న్యూజిలాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

వాంఖడే స్టేడియం వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫస్ట్ సెమీఫైనల్లో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భార‌త్ విజ‌యం సాధించింది.

IND vs NZ: న్యూజిలాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

icc cricket world cup 2023 india vs new zealand 1st semi final live match score and updates

Updated On : November 15, 2023 / 10:30 PM IST

భార‌త్ ఘ‌న విజ‌యం

398 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవ‌ర్ల‌లో 327 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 70 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

33 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 220/4
ష‌మీ బౌలింగ్‌లో సింగిల్ తీసి డారిల్ మిచెల్ 85 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. అదే ఓవ‌ర్‌లో కేన్ విలిమ‌య్స‌న్ (69), టామ్ లాథ‌మ్‌(0)లు ఔట్ అయ్యారు. 33 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్ స్కోరు 220/4. డారిల్ మిచెల్ (100), గ్లెన్ ఫిలిప్స్ (0) లు ఆడుతున్నారు.

మిచెల్, విలియమ్సన్ హాఫ్ సెంచరీలు
తక్కువ స్కోరుకే ఓపెనర్లు ఇద్దరూ అవుటైనా కివీస్ కోలుకుంది. డారిల్ మిచెల్, విలియమ్సన్ హాఫ్ సెంచరీలతో స్కోరును ముందుకు నడిపిస్తున్నారు. న్యూజిలాండ్ 26 ఓవర్లలో 165/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మిచెల్ 64, విలియమ్సన్ 50 పరుగులతో ఆడుతున్నారు.

20 ఓవర్లలో కివీస్ 124/2
న్యూజిలాండ్ 20 ఓవర్లలో 124/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విలియమ్సన్ 32, డారిల్ మిచెల్ 41 పరుగులతో ఆడుతున్నారు.

15 ఓవర్లలో కివీస్ 87/2
న్యూజిలాండ్ 15 ఓవర్లలో 87/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విలియమ్సన్ 25, డారిల్ మిచెల్ 21 పరుగులతో ఆడుతున్నారు.

చెలరేగిన షమీ.. 2 వికెట్లు కోల్పోయిన కివీస్
ప్రపంచకప్ లో మహ్మద్ షమీ హవా కొనసాగుతోంది. షమీ చెలరేగడంతో న్యూజిలాండ్ ఓపెనర్లు స్వల్పస్కోరుకే అవుటయ్యారు. 39 పరుగులకే కివీస్ 2 వికెట్లు కోల్పోయింది. డెవాన్ కాన్వే 13, రచిన్ రవీంద్ర 13 పరుగులు చేసి అవుటయ్యారు.

తొలి వికెట్ కోల్పోయిన కివీస్
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 13 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్ లో అవుటయ్యాడు.

ముగిసిన టీమిండియా బ్యాటింగ్
న్యూజిలాండ్ కు 398 భారత్ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి(117), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ (80) చేశాడు. రోహిత్ శర్మ 47 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు మాత్రమే చేశాడు. చివరల్లో కేఎల్ రాహుల్ వేగంగా పరుగులు సాధించాడు. 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో సౌతీ 3 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్ ఒక వికెట్ తీశాడు.

 

శ్రేయస్ అయ్యర్ సెంచరీ
శ్రేయస్ అయ్యర్ సెంచరీ కొట్టాడు. 67 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో శతకం పూర్తి చేశాడు. ఈ ప్రపంచకప్ లో వరుసగా రెండో సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతడికిది 5వ సెంచరీ. 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 3వ వికెట్ గా అవుటయ్యాడు.

 

కోహ్లి అవుట్.. రెండో వికెట్ డౌన్
43.6 ఓవర్ లో 327 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. రికార్డు సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లి రెండో వికెట్ గా అవుటయ్యాడు. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ లో కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 47 ఓవర్లలో 354/2 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది.

కోహ్లి 50వ సెంచరీ.. భారీ స్కోరు దిశగా టీమిండియా
వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 50వ సెంచరీ చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. 106 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో శతకం పూర్తి చేశాడు.

 

శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ
శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 18వ హాఫ్ సెంచరీ. ఈ ప్రపంచకప్ లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ సాధించడం విశేషం. 37 ఓర్లలో 270/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది.

 

భారీ స్కోరు దిశగా టీమిండియా
టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళుతోంది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ దుమ్మురేపుతున్నారు. 36 ఓర్లలో 265/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది. కోహ్లి 86, శ్రేయస్ అయ్యర్ 49 పరుగులతో ఆడుతున్నారు.

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
టీమిండియా స్టార్ బ్యాటర్ హాఫ్ సెంచరీ బాదాడు. 59 బంతుల్లో 4 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 72వ హాఫ్ సెంచరీ. 29 ఓవర్లలో 203/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది. కోహ్లి 57, శ్రేయస్ అయ్యర్ 16 పరుగులతో ఆడుతున్నారు.

 

శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్
శుభ్‌మన్ గిల్ గాయంతో మైదానాన్ని వీడాడు. 79 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అతడు మళ్లీకి బ్యాటింగ్ కు దిగుతాడో, లేదో చూడాలి. గిల్ మైదానాన్ని వీడడంతో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ కు వచ్చాడు. 24 ఓవర్లలో 173/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది.

టీమిండియా 20 ఓవర్లలో 150/1
టీమిండియా నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 150 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ 74, విరాట్ కోహ్లి 24 పరుగులతో ఆడుతున్నారు.

శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ చేశాడు. 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. అతడికిది 13వ హాఫ్ సెంచరీ కాగా, ప్రపంచకప్ లో నాలుగోది. 17 ఓవర్లలో 132/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లి 19 పరుగులతో ఆడుతున్నాడు.

 

రోహిత్ శర్మ అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్ర్లర్లతో 47 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ లో విలియమ్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 9 ఓవర్లలో 75/1 స్కోరుతో ఇండియా ఆట కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్(21), విరాట్ కోహ్లి(4) క్రీజ్ లో ఉన్నారు. కాగా, ప్రపంచకప్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు.

 

టీమిండియా 5 ఓవర్లలో 47/0
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆకట్టుకుంటున్నారు. రోహిత్ శర్మ తనదైన పవర్ ప్లేతో దూసుకుపోతున్నాడు. టీమిండియా 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. రోహిత్ 34, గిల్ 11 పరుగులతో ఆడుతున్నారు.

టీమిండియా బ్యాటింగ్ ప్రారంభం
టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్నారు. 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రోహిత్ 16, గిల్ 8 పరుగులతో ఆడుతున్నారు. ఫస్ట్ ఓవర్ లో రోహిత్ రెండు ఫోర్లు, రెండో ఓవర్ లో గిల్ 2 ఫోర్లు కొట్టారు. మూడో ఓవర్ లో రోహిత్ సిక్సర్ బాదాడు.

టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫస్ట్ చేయాలని నిర్ణయించాడు. అంతా ఊహించినట్టుగా టీమిండియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటర్లదే బాధ్యత. కివీస్ బౌలర్లను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడివుంటాయి.

 

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్(కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

వాంఖడే స్టేడియంలో రణబీర్ కపూర్
సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో వాంఖడే స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. మరికాసేపట్లో టాస్ వేయనున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ స్టేడియంలోకి వచ్చాడు. యాంకర్లతో కలిసి కాసేపు మాట్లాడాడు. దినేశ్ కార్తీక్ కూడా మైదానంలో రోహిత్ శర్మతో మాట్లాడుతూ కనిపించాడు.

ODI World Cup 2023 IND vs NZ: వన్డే ప్రపంచకప్ లో తుది సమరానికి నేడు తెర లేవనుంది. మొదటి సెమీ ఫైనల్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఈరోజు మ్యాచ్ లో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. లీగ్ దశలో కివీస్ ను ఓడించిన రోహిత్ సేన అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 2019 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అటు కివీస్ టీమ్ కూడా పైనల్ బెర్త్ కోసం గట్టి పోరాటానికి రెడీ అయింది. రన్ రేటుతో సెమీస్ చేరినా అసలు పోరులో సత్తా చాటాలని భావిస్తోంది.

టాస్ కీలకం
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, కివీస్ మధ్య జరుగుతున్న తొలి సెమీస్ లో టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునే అవకాశముంది. గత మ్యాచ్ లను పరిశీలిస్తే ఇక్కడ ఛేజింగ్ కష్టమని తేలింది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి మార్పులు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగనుంది. మరోవైపు విజయం కోసం ఇరుజట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.

 

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి
భారత్, కివీస్ మ్యాచ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇండియా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. టీమిండియా ప్లేయర్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, గణాంకాలు షేర్ చేస్తున్నారు. టీమిండియాకు విషెస్ చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సెమీఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సత్తా చాటాలని కోరుకుంటున్నారు. మీమ్స్ కూడా షేర్ చేసి నవ్వులు పూయిస్తున్నారు. ఇక, వాంఖడే స్టేడియం వద్ద ఈరోజు ఉదయం నుంచే అభిమానుల సందడి కనిపిస్తోంది.