ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు

అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయాలు సాధిస్తూ వచ్చింది.

ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు

ICC Cricket World Cup Semi Finals

ICC Cricket World Cup Semi-Final : వన్డే వరల్డ్ కప్-2023లో సెమీ ఫైనల్స్ బెర్త్ లు ఖరారు అయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీ ఫైనల్స్ కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ అర్హత సాధించాయి. వన్డే వరల్డ్ కప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్క్రమించడంతో న్యూజిలాండ్ నాలుగో జట్టుగా సెమీస్ కు క్వాలిఫై అయింది. నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో ఫస్ట్ సెమీ ఫైనల్ లో ఆథిత్య భారత్ తో న్యూజిలాండ్ తలపడనుంది.

నవంబర్ 16న ఈడెన్ గార్డెన్ లో రెండో సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇక, 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ లోనూ భారత్, న్యూజీలాండ్ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఫైనల్ కు చేరిన న్యూజిలాండ్ ఇంగ్లాండ్ చేతిలో పరాజయం పాలైంది.

ENG vs PAK : పాకిస్థాన్ పై ఘ‌న విజ‌యం.. ఛాంపియ‌న్స్‌ ట్రోఫీకి అర్హ‌త సాధించిన ఇంగ్లాండ్

అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఆడిన అన్ని మ్యాచుల్లోనూ భారత్ విజయాలు సాధిస్తూ వచ్చింది. ఈసారి కివీస్ గండాన్ని గట్టెక్కి గత సెమీస్ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలని టీమిండియా కసరత్తు చేస్తోంది. పాయింట్ పట్టికలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కు ఒక్క వరల్డ్ కప్ కూడా రాలేదు.

ఇప్పటివరకు ఐదుసార్లు కివీస్ సెమీస్ కు చేరింది. 2007, 2011, 2015లో సెమీ ఫైనల్ వరకు వెళ్లగా 2019లో రన్నరప్ గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా వరల్డ్ కప్ కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ ఉవ్విల్లూరుతోంది. భారత్ రెండు సార్లు వరల్డ్ కప్ సాధించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈసారి వరల్డ్ కప్ పక్కా అంటున్నారు క్రికెట్ నిపుణులు.

AUS vs BAN : బంగ్లాదేశ్‌కు ఆస్ట్రేలియా చెక్‌.. 8 వికెట్ల తేడాతో గెలుపు.. వ‌రుస‌గా ఏడో విజ‌యం

సెమీస్ కు చేరిన నాలుగు టీమ్స్ మంచి ఫామ్ లో ఉన్నాయి. మొదట్లో ఓటములతో ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆ తర్వాత పుంజుకుని ఇరగదీశాయి. రెండో సెమీస్ లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికా విజయం సాధిస్తే, మొదటి సెమీస్ లో న్యూజిలాండ్ పై టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్ లో సౌతాఫ్రికాతో రోహిత్ శర్మ సేన తలపడనుంది. సఫారీలపై ఫైనల్ ఫైట్ లో మనోళ్లు పైచేయి సాధిస్తారని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.