SA vs AUS : ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం

రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

SA vs AUS

ఆస్ట్రేలియా ఘ‌న విజ‌యం
213 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆస్ట్రేలియా 47.2 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ట్రావిస్ హెడ్ అర్ధ‌శ‌త‌కం.. 
ఓ మోస్త‌ర్ ల‌క్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఓపెన‌ర్లు వార్న‌ర్ (29), ట్రావిస్ హెడ్ లు మొద‌టి వికెట్‌కు 60 ప‌రుగులు జోడించి శుభారంభం అందించారు. వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన మిచెల్ మార్ష్ (0) డ‌కౌట్ కావ‌డంతో 61 ప‌రుగుల‌కే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓ వైపు దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్ 40 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 12 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 92/2. ట్రావిస్ హెడ్ (55), స్టీవ్ స్మిత్ (7)లు ఆడుతున్నారు.

ఆస్ట్రేలియా టార్గెట్‌.. 213
డేవిడ్ మిల్ల‌ర్ (101; 116 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) సెంచ‌రీ చేయ‌డంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నద‌క్షిణాఫ్రికా 49.4 ఓవ‌ర్ల‌లో 212 ప‌రుగులకు ఆలౌటైంది. హెన్రిచ్ క్లాసెన్ (47) రాణించగా.. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ద‌క్షిణాఫ్రికా ఓ మోస్త‌రు స్కోరుకే ప‌రిమిత‌మైంది. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్, పాట్ క‌మిన్స్ చెరో మూడు వికెట్లు తీశారు. హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.


24 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికాకు ఆసీస్ బౌల‌ర్లు చుక్క‌లు చూపిస్తున్నారు. క్వింట‌న్ డికాక్ (3), బ‌వుమా (0), డ‌స్సెన్ (6), మార్‌క్ర‌మ్ (10) లు విఫ‌లం కావ‌డంతో 24 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు ద‌క్షిణాఫ్రికా స్కోరు 32/4. డేవిడ్ మిల్ల‌ర్ (5), క్లాసెన్ (3) లు ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికా తుది జ‌ట్టు : క్వింటన్ డికాక్( వికెట్ కీప‌ర్), టెంబా బావుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డుసెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు : ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీప‌ర్‌), పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

టాస్ గెలిచిన సౌతాఫ్రికా..
కీల‌క మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ బ‌వుమా టాస్ గెలిచాడు. మ‌రో ఆలోచ‌న లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

South Africa vs Australia : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 చివ‌రి అంకానికి చేరుకుంది. రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డున్నాయి. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించిన జ‌ట్టు ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.