IND vs ENG : 100 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా విజ‌య జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ల‌క్నో వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs ENG

భార‌త్ ఘ‌న విజయం
230 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 34.5 ఓవ‌ర్ల‌లో 129 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 100 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఆదిల్ ర‌షీద్ క్లీన్ బౌల్డ్‌..
మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ఆదిల్ ర‌షీద్ (13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 33.6వ ఓవ‌ర్‌లో 122 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

లివింగ్ స్టోన్ ఎల్బీ..
కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో లియామ్ లివింగ్ స్టోన్ (27) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 29.3వ ఓవ‌ర్‌లో 98 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

క్రిస్‌వోక్స్ స్టంపౌంట్‌..
జ‌డేజా బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ (10) స్టంపౌంట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 28.1వ ఓవ‌ర్‌లో 98 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

మొయిన్ అలీ ఔట్‌..
మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో మొయిన్ అలీ (15) కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 23.1వ ఓవ‌ర్‌లో 81 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయింది.

బ‌ట్ల‌ర్ క్లీన్‌బౌల్డ్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో బ‌ట్ల‌ర్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 15.1వ ఓవ‌ర్‌లో 52 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

బెయిర్‌ స్టో క్లీన్‌బౌల్డ్‌..
ఇంగ్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో బెయిర్ స్టో (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 9.1వ ఓవ‌ర్‌లో 39 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

బెన్‌స్టోక్స్ క్లీన్‌బౌల్డ్‌..
మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 7.6వ ఓవ‌ర్‌లో 33 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసిన బుమ్రా
బుమ్రా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్‌ను వేసిన బుమ్రా ఐదో బంతికి డేవిడ్ మ‌ల‌న్ (16; 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ల‌ను క్లీన్ బౌల్డ్ చేయ‌గా ఆ తరువాతి బంతికి జో రూట్ (0) ను ఎల్బీడ‌బ్ల్యూగా పెవిలియ‌న్‌కు చేర్చాడు. 5 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 30/2.

4 ఓవ‌ర్ల‌కు ఇంగ్లాండ్ స్కోరు 26/0
ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఇంగ్లాండ్ స్కోరు 26/0. డేవిడ్ మ‌ల‌న్ (12), జానీ బెయిర్ స్టో (10) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ టార్గెట్‌.. 230
టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 229 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో రోహిత్ శ‌ర్మ (87; 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాప్ సెంచరీ చేశాడు. సూర్య‌కుమార్ యాద‌వ్ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) ఒక్క ప‌రుగు తేడాతో అర్ధ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. కేఎల్ రాహుల్ (39; 58 బంతుల్లో 3 ఫొర్లు) ఫ‌ర్వాలేద‌నిపించాడు. గిల్ (9), కోహ్లీ (0), శ్రేయ‌స్ అయ్య‌ర్ (4) లు విఫ‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో డేవిడ్ విల్లీ మూడు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్‌, ఆదిల్ ర‌షీద్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మార్క్ వుడ్ ఓ వికెట్ సాధించాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (49; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్స్‌) క్రిస్ వోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 46.2వ ఓవ‌ర్‌లో భార‌త్ 208 ప‌రుగుల వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

ష‌మీ ఔట్‌..
మార్క్‌వుడ్ బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ (1) జోస్ బ‌ట్ల‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 41.2వ ఓవ‌ర్‌లో 183 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అంత‌క ముందు ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో ర‌వీంద్ర జ‌డేజా (8) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు.

రోహిత్ శ‌ర్మ శ‌త‌కం మిస్‌..
ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు రోహిత్ శ‌ర్మ‌. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లోనూ అదే కంటిన్యూ చేశాడు. అయితే.. మ‌రో సారి శ‌త‌కం చేసే అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన రోహిత్ శ‌ర్మ (87; 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) బౌండ‌రీ లైన్ వ‌ద్ద లివింగ్ స్టోన్ చేతికి చిక్కాడు. దీంతో భార‌త్ 36.5వ ఓవ‌ర్ లో 164 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

కేఎల్ రాహుల్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో బెయిర్ స్టో క్యాచ్ అందుకోవ‌డంతో కేఎల్ రాహుల్ (39; 58 బంతుల్లో 3 ఫొర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 30.2వ ఓవ‌ర్‌లో 131 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

30 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 131/3
ఇంగ్లాండ్‌కు ముందు భారీ ల‌క్ష్యం ఉంచాల‌నే ఉద్దేశ్యంతో అర్ధ శ‌త‌కం త‌రువాత రోహిత్ శ‌ర్మ దూకుడు పెంచాడు. ప్ర‌తి ఓవ‌ర్‌లో ఓ బౌండ‌రీ బాదుతున్నాడు. 30 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు131/3. రోహిత్ శ‌ర్మ (79), కేఎల్ రాహుల్ (39)లు ఆడుతున్నారు.

రోహిత్ శ‌ర్మ హాఫ్ సెంచరీ..
మార్క్ ఉడ్ బౌలింగ్‌లో(23.3వ ఓవ‌ర్) రెండు ప‌రుగులు తీసిన రోహిత్ శ‌ర్మ 66 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల‌లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. వ‌న్డేల్లో రోహిత్ కు ఇది 54వ అర్ధ‌శ‌త‌కం. 24 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 89/3. రోహిత్ శ‌ర్మ (57), కేఎల్ రాహుల్ (19) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (4) మార్క్ వుడ్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ కు చేరుకున్నాడు. దీంతో భార‌త్ 11.5వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

విరాట్ కోహ్లీ డ‌కౌట్‌
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లీ (0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో భార‌త్ 6.5వ ఓవ‌ర్‌లో 27 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 28/2. శ్రేయ‌స్ అయ్య‌ర్ (1), రోహిత్ శ‌ర్మ (18)లు ఆడుతున్నారు.

శుభ్‌మ‌న్ గిల్ క్లీన్‌బౌల్డ్‌
టీమ్ఇండియాకు మొద‌టి షాక్ త‌గిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ (9) క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 26 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

రోహిత్ శ‌ర్మ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌
డేవిడ్ విల్లీ వేసిన మొద‌టి ఓవ‌ర్‌ను మొయిడిన్‌గా ఆడిన రోహిత్ అత‌డు వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవ‌ర్‌లో ఓ ఫోర్‌, రెండు సిక్స్ లు బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తంగా 18 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 22 0. రోహిత్ శ‌ర్మ (17), శుభ్‌మ‌న్ గిల్ (5) లు ఆడుతున్నారు.

మొద‌టి ఓవ‌ర్ మొయిడిన్‌
ఓపెన‌ర్లుగా రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ లు బ‌రిలోకి దిగారు. మొద‌టి ఓవ‌ర్‌ను డేవిడ్ విల్లీ వేశాడు. రోహిత్ శ‌ర్మ ఒక్క ప‌రుగు చేయ‌లేదు. దీంతో ఈ ఓవ‌ర్ మొయిడిన్ అయ్యింది.1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 0/0. రోహిత్ శ‌ర్మ (0), శుభ్‌మ‌న్ గిల్ (0) లు ఆడుతున్నారు.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు : జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్.

టీమ్ ఇండియా తుది జ‌ట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

India vs England : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ల‌క్నో వేదిక‌గా మ్యాచ్ జ‌రుగుతుతోంది. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా ఓట‌మే ఎరుగ‌ని జ‌ట్టుగా ఉంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిలో విజ‌యం సాధించింది. ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ రెండో స్థానంలో ఉండ‌గా ఇంగ్లాండ్ ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది. టీమ్ఇండియా విజ‌యాల‌కు ఇంగ్లాండ్ బ్రేక్ వేస్తుందా..? లేదంటే భార‌త్ త‌న జైత్ర యాత్రను కంటిన్యూ చేస్తుందా..? చూడాలి.