NED vs AFG: రహ్మత్ షా, హష్మతుల్లా హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ గెలుపు
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం లక్నోలో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ విజయం సాధించింది.

afghanistan
నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ హాఫ్ సెంచరీలతో రాణించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్థాన్ 31.3 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.
LIVE NEWS & UPDATES
-
రహ్మత్ షా హాఫ్ సెంచరీ
అఫ్గానిస్థాన్ 129 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. రహ్మత్ షా హాఫ్ సెంచరీ (52; 54 బంతుల్లో 8 ఫోర్లు) చేసి అవుటయ్యాడు. 28 ఓవర్లలో 160/3 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
-
తొలి వికెట్ కోల్పోయిన అఫ్గానిస్థాన్
180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ 27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్ 10 పరుగులు చేసి అవుటయ్యాడు. 8 ఓవర్లలో 35/1
స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.
-
నెదర్లాండ్స్ కొంపముంచిన రనౌట్లు.. తక్కువ స్కోరుకే ఆలౌట్
అఫ్గానిస్థాన్ కు నెదర్లాండ్స్ 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన డచ్ టీమ్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. వరుస రనౌట్లు నెదర్లాండ్స్ కొంపముంచాయి. నలుగురు బ్యాటర్లు రనౌట్ కావడంతో స్వల్ప స్కోరుకు పరిమితమైంది. సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (58), మాక్స్ ఓడౌడ్(42), కోలిన్ అకెర్‌మాన్(29), స్కాట్ ఎడ్వర్డ్స్(0) రనౌటయ్యారు. మిగతా ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 3, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. ముజీబ్ ఉర్ రహ్మాన్ ఒక వికెట్ తీశాడు.
-
8వ వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్.. నలుగురు రనౌట్
34.4 ఓవర్ లో 152 పరుగుల వద్ద నెదర్లాండ్స్ 8వ వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (58) రనౌటయ్యాడు. అతడితో కలిసి మొత్తం నలుగురు రనౌటయ్యారు.
-
ఏడో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్.. ముగ్గురు రనౌట్
31 ఓవర్ లో 134 పరుగుల వద్ద నెదర్లాండ్స్ ఏడో వికెట్ కోల్పోయింది. మాక్స్ ఓడౌడ్(42), కోలిన్ అకెర్‌మాన్(29), స్కాట్ ఎడ్వర్డ్స్(0) రనౌటయ్యారు.
-
రెండో వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
ఫస్ట్ ఓవర్ లోనే వికెట్ నష్టపోయిన నెదర్లాండ్స్ కోలుకుంది. 11.3 ఓవర్ లో 73 పరుగుల వద్ద నెదర్లాండ్స్ రెండో వికెట్ నష్టపోయింది. మాక్స్ ఓడౌడ్ 42 పరుగులు చేసి రనౌటయ్యాడు. 15 ఓవర్లలో 81/2 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
-
నెదర్లాండ్స్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన నెదర్లాండ్స్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. ఐదో బంతికే ఫస్ట వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వెస్లీ బరేసి ఒక్క పరుగు చేసి ముజీబ్ బౌలింగ్ లో
అవుటయ్యాడు. 2 ఓవర్లలో 9/1 స్కోరుతో డచ్ టీమ్ ఆట కొనసాగిస్తోంది.
-
టాస్ గెలిచిన నెదర్లాండ్స్
నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పిచ్ ఫస్ట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే అవకాశముందని, మంచి స్కోరు చేయాలని భావిస్తున్నామని స్కాట్ ఎడ్వర్డ్స్ చెప్పాడు.
తుది జట్లు
ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఫజల్హాక్ ఫరూఖీ, నూర్నెదర్లాండ్స్ : వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్/వికెట్ కీపర్), బాస్ డి లీడే, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్
ODI ICC World Cup 2023
Netherlands Vs Afghanistan
Match: 34
Netherlands wins the toss and elects to bat first ?#CWC23 #NEDvAFG pic.twitter.com/M8PpH8pNtG— Aawaj (आवाज) (@Aawaj55) November 3, 2023
-
నెదర్లాండ్స్ అద్భుతం చేస్తుందా?
నెదర్లాండ్స్ ఈరోజు మ్యాచ్ లో సత్తా చాటాలని భావిస్తోంది. సౌతాఫ్రికాను ఓడించి సంచలనం రేపిన డచ్ టీమ్ విజయంపై కన్నేసింది. తమదైన రోజున అద్భుతాలు చేయగలమని నెదర్లాండ్స్ ఇప్పటికే నిరూపించుకుంది. దీంతో నెదర్లాండ్స్, అఫ్గానిస్థాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి.
-
విజయంపై కన్నేసిన అఫ్గానిస్థాన్
ప్రపంచకప్ లో ఇప్పటివరకు 6 మ్యాచుల్లో 3 గెలిచి పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది అఫ్గానిస్థాన్. ఈ రోజు మ్యాచ్ లో డచ్ టీమ్ ను ఓడించి సెమీస్ చాన్స్ సజీవంగా ఉంచుకోవాలని అఫ్గానిస్థాన్ భావిస్తోంది. మంచి రన్ రేటుతో విజయం సాధిస్తే 8 పాయింట్లతో న్యూజిలాండ్ సరసన చేరుతుంది. కివీస్ ఏడు మ్యాచుల్లో 4 గెలిచి 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా టాప్ ఉండగా, సౌతాఫ్రికా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో కొనసాగుతోంది.