ENGw vs INDw : భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్‌కు ఐసీసీ భారీ జరిమానా..
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది.

ICC punishes India star and England for Code of Conduct violation
ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించి గెలుపు జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ ప్రతీకా రావల్‌కు జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించడంతో ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించింది. అంతే కాదండోయ్ ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
మూడు వన్డేల సిరీస్‌లో సౌతాంప్టన్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య బుధవారం (జూలై 16న) తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ప్రతీకా రావల్ సింగిల్ తీసే క్రమంలో ఇంగ్లాండ్ పేసర్ లారెన్ ఫైలర్ ను ఢికొట్టింది. ఆ తరువాత మరుసటి ఓవర్‌లో ఔటైన తరువాత డెస్సింగ్ రూమ్‌కు వెలుతూ ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ను ఢికొట్టింది.
Jos Buttler : టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్‌లో ఏడో ఆటగాడు ఇతడే..
‘ప్రతీకా ప్రవర్తనా నియమావళి యొక్క లెవల్ 1 ను ఉల్లంఘించినట్లు తేలింది. రావల్ కు ఆమె మ్యాచ్ ఫీజులో 10% జరిమానా విధించడంతో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చాం.’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. 24 నెలల కాలంలో ప్రతీకా చేసిన తొలి తప్పిదం ఇదే.. ఈ మ్యాచ్‌లో ప్రతీకా.. 51 బంతులు ఆడి 3 ఫోర్ల సాయంతో 36 పరుగులు సాధించింది.
ఇంగ్లాండ్‌కు ఫైన్..
మరోవైపు తొలి వన్డేలో స్లో ఓవర్ రేటును నమోదు చేసినందుకు ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి ఇంగ్లాండ్ ఓ ఓవర్‌ను తక్కువగా వేసింది. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా పడింది.
Luke Hollman : ఇదెక్కడి షాట్ రా అయ్యా.. దీనికి ఏం పేరు పెట్టాలో కాస్త చూసి చెప్పండి బాబులు..
తొలి వన్డే విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని భారత్ 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత ప్లేయర్లలో దీపక్తి శర్మ (62 నాటౌట్) హాఫ్ సెంచరీ చేసింది.
ఇరు జట్ల మధ్య లార్డ్స్ వేదికగా జూలై 19 న రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.